జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో భారత సైన్యం, పాక్ సైన్యం మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఉత్తర కశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ (కుప్వారా) సెక్టార్‌లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) జరిపిన దాడిని భారత సైనికులు భగ్నం చేశారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఐదుగురు భారత సైనికులు గాయపడ్డారు. వారిలో ఒక జవాను వీరమరణం పొందారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కమాండోలతో పాటు, బాట్ టీమ్ స్క్వాడ్‌లలో అల్-బదర్, తెహ్రికుల్ ముజాహిదీన్, లష్కర్, జైష్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలోనే ఎన్‌కౌంటర్ జరిగింది.
ప్రస్తుతం మచల్‌లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం(నేడు) తెల్లవారుజామున మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌లో ఉన్న సైనికులు అటుగా కొందరు(బ్యాట్ స్క్వాడ్) వెళ్లడాన్ని గమనించారు. వారిని లొంగిపోవాలని కోరారు. దీంతో బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి, పరుగులు తీయడం ప్రారంభించింది. దీంతో భారత సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఈ నేపధ్యంలో ఐదుగురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక జవాను చికిత్స పొందుతూ వీరమరణం పొందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక బ్యాట్ సభ్యుడు హతమయ్యాడు. అతని మృతదేహం పాక్ సైన్యానికి చెందిన డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్‌లో పడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment