విమాన బ్రేకులు ఫెయిలై టైర్లు పేలడంతో.. | Air India plane overshoots runway in Jammu | Sakshi
Sakshi News home page

విమాన బ్రేకులు ఫెయిలై టైర్లు పేలడంతో..

Published Fri, Jun 9 2017 8:58 PM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

విమాన బ్రేకులు ఫెయిలై టైర్లు పేలడంతో.. - Sakshi

విమాన బ్రేకులు ఫెయిలై టైర్లు పేలడంతో..

జమ్మూలో ల్యాండ్‌ అవుతుండగా బ్రేక్‌ ఫెయిల్‌, పేలిన టైర్లు
జమ్మూ:
జమ్మూ విమానాశ్రయంలో శుక్రవారం 134 మంది ప్రయాణికులతో కూడిన ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఏఐ 821 విమానం మధ్యాహ్నం 12.15 గంటలకు ల్యాండ్‌ అవుతుండగా బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. తర్వాత నాలుగు టైర్లు పేలిపోయాయి విమానం రన్‌వేపై నుంచి పక్కకు జారి చివరకు రన్‌వే ఆఖరి భాగంలో నిలిచిపోయింది.

ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటన వల్ల దాదాపు 10 విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. రన్‌వే తప్పిన విమానం ఎయిర్‌బస్‌ క్లాసిక్‌ ఏ320 రకానికి చెందినది. ఎయిరిండియా ఈ రకం పాత విమానాల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెడుతోంది. ఇప్పటికే నాలుగు కొత్త విమానాలను కొనుగోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement