మళ్లీ పరీక్ష నిర్వహించాలి: ఇంటర్ విద్యార్థులు
Published Sat, Mar 4 2017 6:37 PM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM
జమ్మూ: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ లో సిలబస్ లోలేని ప్రశ్నలు అడిగారని జమ్మూ విద్యార్థులు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని దిగ్భాందించారు. ఇంటర్ బోర్డు సిలబస్ లోలేని ప్రశ్నలు పరీక్షలో ఇచ్చిందని వారు తీవ్రంగా మండిపడ్డారు. స్కూల్ బోర్డు సిలబస్ లోలేని ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చిందని ప్రశ్నించారు.
ఫిజిక్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని వారు డిమండ్ చేశారు. పోలీసులకు చెందిన వాహనాలను విద్యార్థులు ధ్వంసం చేయడంతో వారిని మా పర్యవేక్షణలోకి తీసుకున్నామని జమ్మూ డిప్యూటి కమీషనర్ సిమ్రన్ ధీప్ సింగ్ తెలిపారు.
Advertisement
Advertisement