కారు ఆపమన్నందుకు పోలీసును కాల్చేశారు | Policeman fired at, injured in Jammu | Sakshi
Sakshi News home page

కారు ఆపమన్నందుకు పోలీసును కాల్చేశారు

Published Mon, Jun 29 2015 12:38 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM

కారు ఆపమన్నందుకు పోలీసును కాల్చేశారు - Sakshi

కారు ఆపమన్నందుకు పోలీసును కాల్చేశారు

జమ్ము: చెక్పోస్ట్ వద్ద తనిఖీ చేసేందుకు కారు ఆపాలన్న పోలీసుపై దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. జమ్ముకశ్మీర్ లోని కథువా జిల్లాలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ జగదీశ్ ప్రస్తుతం జమ్ము ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంజాబ్ రిజిస్ట్రేషన్ ఉన్న కారులో నిందితులు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. కాగా, దీనిని ఉగ్రవాదుల చర్యగా భావించడం లేదని, నిందితులు స్మగ్లర్లు అయిఉంటారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement