షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్దం | The Car Got Fire In Kodhada | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్దం

May 16 2019 4:16 PM | Updated on May 16 2019 8:38 PM

The Car Got Fire In Kodhada - Sakshi

ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన కారు

సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం తోగర్రాయి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణంలో ఉన్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై కారులో నుంచి వెంటనే దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం సమయంలో టాటా ఇండికా కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. సకాలంలో ఫైరింజన్‌ రాకపోవడం వల్ల కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
కోదాడ వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement