మిసెస్‌ ఇండియాగా 55 ఏళ్ల మహిళ! | 55 Year Old Rupika Grover Wins Mrs India One In A Million 2023 | Sakshi
Sakshi News home page

మిసెస్‌ ఇండియాగా 55 ఏళ్ల మహిళ! గెలుపుకి ఏజ్‌తో పనిలేదని ప్రూవ్‌ చేసింది!

Published Tue, Jan 9 2024 1:53 PM | Last Updated on Tue, Jan 9 2024 4:45 PM

55 Year Old Rupika Grover Wins Mrs India One In A Million 2023 - Sakshi

అందాల పోటీల్లో పాల్గొనేవాళ్లంతా టీనేజర్లు, పెళ్లి కానీ వాళ్లే ఉంటారు. ఇటీవల ఇంకాస్త ముందడుగు వేసి పెళ్లైన వాళ్లు కూడా పాల్గొని స్ఫూర్తిగా నిలిచారు. కానీ వాటన్నింటిని దాటి ఐదు పదుల వయసులో అది కూడా ఇద్దరు పిల్లల తల్లి అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటి శభాష్‌ అనిపించుకుంది. చెప్పాలంటే ఆమె గెలుపు చారిత్రాత్మక విజయానికి నాంది పలికింది. 

వివరాల్లోకెళ్తే.. జమ్మూ నగరానికి చెందిన 55 ఏళ్ల రూపికా గ్రోవర్‌ మోడల్‌ మిసెస్‌ ఇండియా వన్‌ ఇన్‌ ఏ మిలియన్‌ 2023 అందాల పోటీల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. సక్సెస్‌కి వయోపరిమితి ఉండదని ప్రూవ్‌ చేసింది. ప్రతి మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె నటి, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌. ఆమె నటన, మోడలింగ్‌ ప్రపంచంలోకి చాలా నిర్భయంగా అడుగుపెట్టి తానెంటో ప్రూవ్‌ చేసుకున్న ధీశాలి. బాలీవుడ్‌ దిగ్గజ నటులు అమితా బచ్చన్‌, రణవీర్‌సింగ్‌ వంటి లెజెండరీ నటులతో కలిసి పనిచేసింది. అంతేగాదు ఆమె ఇద్దరు పిల్లల తల్లి కూడా.

ఇక రూపిక గ్రోవర్‌ ఫిట్‌ క్లాసిక్‌, బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ క్లాసిక్‌, టాలెంటెడ్‌ క్లాసిక్‌ వంటి టైటిళ్లను కూడా దక్కించుక్ను టాలెంటెడ్‌ మహిళ. ఇద్దరు పిల్లల తల్లిగానూ అలాగే తన కెరీర్‌ పరంగా అచంచలంగా దూసుకుపోతూ మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇక్కడ ఆమె కనబర్చిన ఆచంచలమైన నిబద్ధత, అంకితబావాలే ఆ విజయాల పరంపరను తెలియజేస్తున్నాయి. ఆమె విజయగాథ ఎలాంటి పరిస్థితులోనైనా తమ డ్రీమ్స్‌ని వదులకోకుండా కృషి చేయలని తెలుపుతోంది. దేనిలోనైన విజయ సాధించాలంటే అటెన్షన్‌ ఉంటే చాలు వయసుతో సంబంధం లేదని చాటి చెటి చెప్పింది.

ఇక ఈ మిసెస్‌ ఇండియా వన్‌ ఏ మిలియన్‌ అనేది దేశంలో వివాహిత మహిళల కోసం ప్రత్యేకంగా కండెక్ట్‌ చేస్తున్న అందాల పోటీ. ఇది మహిళలంతా విజేతలే అనే లక్ష్యంగా ఈ పోటీలను పెడుతోంది. తమ కలలను వాస్తవంలోకి తీసుకురాలేకపోయిన మహిళలకు ఇదోక గొప్ప వేదిక. ఈ పోటీల్లో రూపికా గ్రోవర్‌ చారిత్రాత్మక విజయాన్ని సాధించి మహిళందరికి ప్రేరణగా నిలిచింది. ఆమెలాంటి ఎందరో మహిళలు ధైర్యంగా తమ కలలను నెరవేర్చుకునేందుకు రూపికా గ్రోవర్‌ గెలుపే స్పూర్తినిస్తుంది. 

(చదవండి: ఎవరీమె? ఆమె స్పీచ్‌కి..పార్లమెంటే దద్దరిల్లింది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement