Beauty Competitions
-
మిస్ అమెరికాగా ఎయిర్‌ఫోర్స్ అధికారిణి!
కొలరాడోకు చెందిన 22 ఏళ్ల మాడిసన్ మార్ష్ మిస్ అమెరికా 2024 అందాల పోటీల్లో విజేతగ నిలిచి కిరీటాన్ని దక్కించుకుంది. ఆమెఎయిర్ఫోర్స్ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మిస్ అమెరికా టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కొలరాడోకు ప్రాతినిధ్యం వహిస్తున్న మార్ష్ ఓ పక్కన అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ ఘనత సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో పంచుకుంది. "మీకు ఆకాశమే హద్దు!. మిమ్మల్ని ఆపగలిగే వారే లేరు. రెండు పడవల మీద కాలు వేయలేం అనే వాళ్లకు నా విజయమే ఓ సమాధానం. మీ అభిరుచి ఎంతటి కష్టమైనా తట్టుకుని సాధించేలా చేయగలదు." అని ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చింది మార్ష్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక మార్ష్ మే 2023లో మిస్ కొలరాడో కిరీటం కూడా గెలుచుకుంది. ఆమె ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి ఫిజిక్స్ పట్టా పొందే కొద్ది రోజుల ముందే ఈ విజయం సాధించింది. Congratulations to our very own #Airman, 2nd Lt. Madison Marsh, aka Miss Colorado — who was just crowned @MissAmerica 2024! Marsh is the first active duty servicemember to ever win the title.#AimHigh pic.twitter.com/3RuDu5CulW — U.S. Air Force (@usairforce) January 15, 2024 మార్ష్ ఒక పక్క ఎయర్‌ఫోర్స్‌లో రెండవ లెఫ్టినెంట్‌గా కఠినతరమైన బాధ్యతలు చేపట్టడమేగాక మిస్ హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని కూడా చేస్తూ..ఈ మిస్ అమెరికా అందాల పోటీకి ప్రీపేర్ అయ్యింది. నాకు ఇష్టమైన రెండు విభిన్న రంగాలను చేపట్టి సాధించడం చాలా అద్భుతంగా ఉందని అంటోంది మార్ష్. "మీపై మీకు నమ్మకం ఉంటే మిమ్మలని మీరు ఒక్కచోటకే పరిమితం చేయాల్సిన పనిలేదు. ధైర్యంగా అడగు వేయండి". అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది మార్ష్. ఈ అందాల పోటీకి తాను ఎయిర్‌ఫోర్స్‌లో జాయిన్ అయ్యేందుకు తీసుకున్న శారీరక శిక్షణ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. కాగా ఈ మిస్ అమెరికా అందాల పోటీల్లో మార్స్ మిస్ అమెరికాగా కిరీటాన్ని దక్కించుకోగా, టెక్సాస్‌కు చెందిన ఎల్లీ బ్రూక్స్ రన్నరప్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Miss America (@missamerica) (చదవండి: మిసెస్ ఇండియాగా 55 ఏళ్ల మహిళ! గెలుపుకి ఏజ్‌తో పనలేదని ప్రూవ్ చేసింది!) -
మిసెస్ ఇండియాగా 55 ఏళ్ల మహిళ!
అందాల పోటీల్లో పాల్గొనేవాళ్లంతా టీనేజర్లు, పెళ్లి కానీ వాళ్లే ఉంటారు. ఇటీవల ఇంకాస్త ముందడుగు వేసి పెళ్లైన వాళ్లు కూడా పాల్గొని స్ఫూర్తిగా నిలిచారు. కానీ వాటన్నింటిని దాటి ఐదు పదుల వయసులో అది కూడా ఇద్దరు పిల్లల తల్లి అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటి శభాష్ అనిపించుకుంది. చెప్పాలంటే ఆమె గెలుపు చారిత్రాత్మక విజయానికి నాంది పలికింది. వివరాల్లోకెళ్తే.. జమ్మూ నగరానికి చెందిన 55 ఏళ్ల రూపికా గ్రోవర్ మోడల్ మిసెస్ ఇండియా వన్ ఇన్ ఏ మిలియన్ 2023 అందాల పోటీల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. సక్సెస్‌కి వయోపరిమితి ఉండదని ప్రూవ్ చేసింది. ప్రతి మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె నటి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఆమె నటన, మోడలింగ్ ప్రపంచంలోకి చాలా నిర్భయంగా అడుగుపెట్టి తానెంటో ప్రూవ్ చేసుకున్న ధీశాలి. బాలీవుడ్ దిగ్గజ నటులు అమితా బచ్చన్, రణవీర్‌సింగ్ వంటి లెజెండరీ నటులతో కలిసి పనిచేసింది. అంతేగాదు ఆమె ఇద్దరు పిల్లల తల్లి కూడా. ఇక రూపిక గ్రోవర్ ఫిట్ క్లాసిక్, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్లాసిక్, టాలెంటెడ్ క్లాసిక్ వంటి టైటిళ్లను కూడా దక్కించుక్ను టాలెంటెడ్ మహిళ. ఇద్దరు పిల్లల తల్లిగానూ అలాగే తన కెరీర్ పరంగా అచంచలంగా దూసుకుపోతూ మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇక్కడ ఆమె కనబర్చిన ఆచంచలమైన నిబద్ధత, అంకితబావాలే ఆ విజయాల పరంపరను తెలియజేస్తున్నాయి. ఆమె విజయగాథ ఎలాంటి పరిస్థితులోనైనా తమ డ్రీమ్స్‌ని వదులకోకుండా కృషి చేయలని తెలుపుతోంది. దేనిలోనైన విజయ సాధించాలంటే అటెన్షన్ ఉంటే చాలు వయసుతో సంబంధం లేదని చాటి చెటి చెప్పింది. ఇక ఈ మిసెస్ ఇండియా వన్ ఏ మిలియన్ అనేది దేశంలో వివాహిత మహిళల కోసం ప్రత్యేకంగా కండెక్ట్ చేస్తున్న అందాల పోటీ. ఇది మహిళలంతా విజేతలే అనే లక్ష్యంగా ఈ పోటీలను పెడుతోంది. తమ కలలను వాస్తవంలోకి తీసుకురాలేకపోయిన మహిళలకు ఇదోక గొప్ప వేదిక. ఈ పోటీల్లో రూపికా గ్రోవర్ చారిత్రాత్మక విజయాన్ని సాధించి మహిళందరికి ప్రేరణగా నిలిచింది. ఆమెలాంటి ఎందరో మహిళలు ధైర్యంగా తమ కలలను నెరవేర్చుకునేందుకు రూపికా గ్రోవర్ గెలుపే స్పూర్తినిస్తుంది. View this post on Instagram A post shared by Rupika Grover (@rupikagrover) (చదవండి: ఎవరీమె? ఆమె స్పీచ్‌కి..పార్లమెంటే దద్దరిల్లింది!) -
ఆఫ్రికా అందం
-
‘మిస్ నెల్లూరు-2016’ పోటీలు
నెల్లూరు: ప్యూచరాల్, క్యాచ్‌మి ఆధ్వర్యంలో సాయిక్రియేటీవ్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్వహిస్తున్న మిస్ నెల్లూరు-2016 అందాల పోటీల ఫైనల్స్‌ను ఆదివారం నిర్వహంచనున్నట్లు కొరియోగ్రాఫర్, స్టైలిస్ట్ రష్మీఠాగూర్ తెలిపారు. నగరంలోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోటీలకు మొత్తం 102 మంది హాజరు కాగా, మౌఖిక పరీక్షల అనంతరం 20 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. నగరంలోని కస్తూరిదేవీ గార్డెన్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగే ఫైనల్ పోటీలో మిస్ నెల్లూరు-2016ను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. వీరితో పాటు మరో ఇద్దరిని ఎంపిక చేసి మిస్ ఆంధ్రా పోటీ లకు పంపుతామన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా డైరక్టర్ యమునా కిషోర్, హీరో భరత్, బాలీవుడ్ హీరోయిన్ ఏక్తా త్రివేది, పారిశ్రామిక వేత్త సన్మోహన్రెడ్డి వ్యవహరించనున్నట్లు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు ఆలీ హాజరుకానున్నట్లు చెప్పారు. ఫ్యాషన్ డిజైనర్ దివ్య, ప్రో గ్రామ్ హెడ్ మాధురిమోహన్, బ్యూటీషియన్ మహితారెడ్డి పాల్గొన్నారు. -
చక్‌దే చక్కదనం
అందానికి అందం సొంతం చేసుకున్న ఈ పుత్తడి బొమ్మలు ఫ్యాషన్ వేదికపై తళుక్కుమన్నాయి. నగరంలోని ‘గుజరాతీ-రాజస్థానీ’ కమ్యూనిటీలు సంయుక్తంగా నిర్వహించనున్న ‘చక్‌దే’ ఈవెంట్ ఏ రేంజ్లో ఉంటుందో తమ సోయగాలతో ట్రైలర్ చూపించారు చక్కనమ్మలు. ఈ నెల 21న మొదలయ్యే ఈ ఫెస్ట్ మార్చి 1 వరకు కొనసాగనుంది. ఆర్ట్స్, స్పోర్ట్స్, కల్చర్, టీ20 క్రికెట్ టోర్నమెంట్, రియాలిటీ షోలు, అందాల పోటీలు, డ్యాన్స్ కాంపిటీషన్స్... ఇలా మొత్తం 15 రకాల ఈవెంట్లు ఉంటాయని నిర్వాహకులు గురువారం తెలిపారు. ఇందులో 11 ఈవెంట్లను తమ కమ్యూనిటీకి మాత్రమే పరిమితం చేసినా, మిగిలిన వాటిలో నగరవాసులు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు.