నెల్లూరు: ప్యూచరాల్, క్యాచ్‌మి ఆధ్వర్యంలో సాయిక్రియేటీవ్ ఎంటర్ టైన్‌మెంట్స్ నిర్వహిస్తున్న మిస్ నెల్లూరు-2016 అందాల పోటీల ఫైనల్స్‌ను ఆదివారం నిర్వహంచనున్నట్లు కొరియోగ్రాఫర్, స్టైలిస్ట్ రష్మీఠాగూర్ తెలిపారు. నగరంలోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
పోటీలకు మొత్తం 102 మంది హాజరు కాగా, మౌఖిక పరీక్షల అనంతరం 20 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. నగరంలోని కస్తూరిదేవీ గార్డెన్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగే ఫైనల్ పోటీలో మిస్ నెల్లూరు-2016ను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. వీరితో పాటు మరో ఇద్దరిని ఎంపిక చేసి మిస్ ఆంధ్రా పోటీ లకు పంపుతామన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా డైరక్టర్ యమునా కిషోర్, హీరో భరత్, బాలీవుడ్ హీరోయిన్ ఏక్‌తా త్రివేది, పారిశ్రామిక వేత్త సన్‌మోహన్‌రెడ్డి వ్యవహరించనున్నట్లు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు ఆలీ హాజరుకానున్నట్లు చెప్పారు. ఫ్యాషన్ డిజైనర్ దివ్య, ప్రో గ్రామ్ హెడ్ మాధురిమోహన్, బ్యూటీషియన్ మహితారెడ్డి పాల్గొన్నారు.
‘మిస్ నెల్లూరు-2016’ పోటీలు
Published Sat, Jul 16 2016 6:21 PM | Last Updated on Wed, Aug 1 2018 2:20 PM
Advertisement
Advertisement