జమ్మూ,కాశ్మీర్ లో ఒంటిరిగానే పోటి: సోని
Published Sun, Jul 20 2014 2:15 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
జమ్మూ: కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కనుమరుగయ్యేలా కనిపిస్తోంది. త్వరలో జమ్మూ, కాశ్మీర్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధికార ప్రతినిధి అంబికా సోని వెల్లడిచింది.
జమ్మూలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో గులాం నబీ ఆజాద్, అంబికా సోని, సైఫుద్దీన్ సోజ్ లు పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87 స్థానాల్లో పోటీ చేస్తుందని అంబికా సోని తెలిపారు.
జమ్మూ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు సాగించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు వ్యవహారానానికి పుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది.
Advertisement