
హద్దులు దాటుతున్న పాక్
సాక్షి, జమ్మూ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ చట్టాన్ని ఉల్లంఘించింది. శనివారం అర్దరాత్రి పొద్దుపోయినప్పటినుంచీ పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వద్ద మోర్టార్ షెల్స్‌తో కాల్పులు జరుపుతోంది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా.. మరో 5మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ కాల్పులుకు తెగబడ్డం ఈ నెల్లో ఇది రెండోసారి. మోర్టార్ కాల్పుల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. పాక్ కాల్పులకు ప్రతిగా బీఎస్‌ఎఫ్ జవాన్లు కూడా కాల్పులు జరిపారు. ఒకదశలో సరిహద్దు రేఖ వెంబడి బుల్లెట్ల వర్షం కురిసింది.