భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్ అతలాకుతలం | flash floods caused by heavy rain in Jammu & Kashmir | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్ అతలాకుతలం

Published Sun, Mar 20 2016 10:29 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్ అతలాకుతలం

భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్ అతలాకుతలం

జమ్మూకశ్మీర్‌ : జమ్మూకశ్మీర్‌లో గత రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. కొండ చరియలు విరిగి పడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేశారు. ఇప్పటి వరకు భారీ వర్షాల కారణంగా ఇద్దరు మహిళలు మృతిచెందారు.

అలాగే భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలతో రాజౌరీలోని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక పూంచ్‌లోని మార్కెట్‌లోకి నీరు చేరడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement