కశ్మీర్‌కు వరద కష్టం | floods in Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌కు వరద కష్టం

Published Sat, Apr 8 2017 1:59 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

floods in Kashmir

శ్రీనగర్‌: కశ్మీర్‌లోయను అకాల వరద ముంచెత్తుతోంది. కశ్మీర్‌ లోయలోని సంగం, శ్రీనగర్‌లోని రామ్‌ మున్షీబాగ్‌ ప్రాంతాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. వరదలు, మంచు చరియలు విరిగిపడటం కారణంగా నలుగురు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు కూలి శ్రీనగర్‌లోని దాల్‌గేట్‌ ప్రాంతంలో 12 గృహాలు ధ్వంసమవగా, ఓ బాలుడు గాయపడ్డాడు. లడఖ్‌ ప్రాంతంలోని బటాలిక్‌ సెక్టార్‌లో మంచులో చిక్కుకుని గల్లంతయిన ముగ్గురు సైనికుల మృతదేహాలను సైనికులు శుక్రవారం వెలికితీశారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు తెలియజేశారు.  సైనికులు అంతా సురక్షితంగానే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement