కశ్మీర్‌లో మిస్టర్‌ బచ్చన్ | Ravi Teja Mr Bachchan Melody duet song shoot underway in Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో మిస్టర్‌ బచ్చన్

Published Mon, Jun 24 2024 6:16 AM | Last Updated on Mon, Jun 24 2024 6:16 AM

Ravi Teja Mr Bachchan Melody duet song shoot underway in Kashmir

కశ్మీర్‌లో మెలోడీ డ్యూయెట్‌ పాడుతున్నాడు మిస్టర్‌ బచ్చన్ . రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్ ’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో పనోరమా స్టూడియోస్‌– టీ సిరీస్‌ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. కాగా ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం కశ్మీర్‌ వ్యాలీలో జరుగుతోంది. రవితేజ, భాగ్యశ్రీ బోర్సేలపై శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్‌.

‘‘నాలుగు రోజులుగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారంతో ఈ సాంగ్‌ షూటింగ్‌ పూర్తయింది. విజువల్‌ ఫీస్ట్‌గా ఉంటూనే ఎమోషనల్‌ ఎలిమెంట్‌తో ఈ సాంగ్‌ ఉంటుంది. ఈ మూవీ షూటింగ్‌ తొంభై శాతం పూర్తయింది. మిగతా భాగాన్ని త్వరగా చిత్రీకరించేలా శరవేగంగా పని చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. జగపతి బాబు, సచిన్‌ ఖేడ్కర్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే హిందీ హిట్‌ ఫిల్మ్‌ అజయ్‌ దేవగన్  ‘రైడ్‌ ’(2018)కు తెలుగు రీమేక్‌గా ‘మిస్టర్‌ బచ్చన్ ’ చిత్రం తెరకెక్కుతోందనే టాక్‌ వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement