
తమిళ సినిమా: మహాశివరాత్రి పర్వదినాన నటి త్రిష మహాశివుని సేవలో తరించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా రాణిస్తున్న ఈమె ఆ మధ్య నటించిన కొన్ని చిత్రాలు నిరాశ పంచడంతో క్రేజ్ తగ్గింది. అయితే పొన్నియిన్ సెల్వన్ చిత్రం విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. నాలుగుపదుల వయసు దగ్గర పడుతున్న ఈ అమ్మడు ఇప్పటికీ అవివాహితే. కాగా ఇటీవల ఈమె దృష్టి దైవ దర్శనాలపై మళ్లిందని భావించవచ్చు. సమయం దొరికినప్పుడల్లా గుళ్లు, గోపురాలు తిరిగేస్తున్నారు.
చదవండి: తారకరత్న భార్య, పిల్లల్ని చూశారా? చిన్న వయసులోనే తీరని దుఃఖం
తాజాగా విజయ్ సరసన లియో చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. నటుడు అర్జున్, దర్శకుడు మిష్కిన్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మన్సూర్ అలీ ఖాన్, నటి ప్రియా ఆనంద్ వంటి ప్రముఖ నటినట్లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కశీ్మర్లో జరుగుతోంది. అక్కడ జమ్మూ కశ్మీర్ సమీపంలోని బహల్ గామ్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో లియో చిత్రం షూటింగ్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
చదవండి: తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి అస్వస్థత..
అక్కడ చిత్ర యూత్ ప్రేమికుల రోజున దిగిన ఫొటోలను నటి త్రిష సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి నెట్టింట్లో వైరల్ అయ్యాయి.. కాగా శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నటి త్రిష కాశ్మీర్‌లోని లింగేశ్వర ఆలయానికి వెళ్లి అక్కడ శివలింగానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయ అర్చకులు దగ్గరుండి మరి త్రిషతో ప్రత్యేక పూజలు జరిపించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన అభిమానులు త్రిష భక్తిని చూసి పారావస్యం పొందడంతో పాటు ఓం నమశివాయ అంటూ లైకులు కొడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment