ఇస్లామాబాద్: కశ్మీర్‌లో భారత్ యంత్రాంగం మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని పాకిస్తాన్ ఆరోపించింది. పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి, మానవహక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారి, జాతీయ భద్రతా సలహాదారు మోయీద్ యూసఫ్ ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కశ్మీర్‌లో హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను ఐక్యరాజ్యసమితికి, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. 131 పేజీల ఈ డాక్యుమెంట్‌లో113 ఉదాహరణలు న్నాయన్నారు. ఉల్లంఘనలకు కారణమైన అధికా రులపై ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితిని వారు కోరారు. కాగా, పాక్ చేసిన ఆరోపణలను భారత్ పలుమార్లు ఖండించింది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment