సాక్షి, హైదరాబాద్ : బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 2005 నుంచి ప్రతిఏటా నిర్వహిస్తున్న ఈ రీయూనియన్ ఈవెంట్‌ను డిసెంబర్ 25, 26తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ భంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మాజి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, అసదుద్దిన్ ఓవైసి, అక్బరుద్దిన్ ఓవైసి, పల్లం రాజు, కిరణ్ కుమార్‌రెడ్డిలాంటి ప్రముఖులెందరో ఇక్కడ విద్యనభ్యసించారు. ఈ ఏడాది నిర్వహించబోతున్న రీయూనియన్ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరువుతున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment