సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రీజినల్ స్పోర్ట్స్ మీట్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్, బేగంపేట్) జట్లు సత్తా చాటాయి. బాస్కెట్‌బాల్ ఈవెంట్‌లో జూనియర్, సీనియర్ బాలుర విభాగాల్లో హెచ్‌పీఎస్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సీనియర్ బాలుర సెమీస్‌లో హెచ్‌పీఎస్... హెరిటేజ్ వ్యాలీ స్కూల్‌తో, గీతాంజలి స్కూల్... అభ్యాస స్కూల్‌తో తలపడతాయి. జూనియర్ బాలుర సెమీస్‌లో సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ)తో హెచ్‌పీఎస్, జాన్సన్ గ్రామర్ స్కూల్‌తో ఫ్యూచర్ కిడ్స్ పోటీ పడతాయి. శుక్రవారం జరిగిన సీనియర్ బాలుర పోటీల్లో శ్రీనిధి స్కూల్ 39-15తో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి)పై, గీతాంజలి స్కూల్ 35-21తో హెరిటేజ్ వ్యాలీపై, హెచ్‌పీఎస్ 51-21తో అభ్యాస స్కూల్‌పై విజయం సాధించాయి.
జూనియర్ బాలుర పోటీల్లో సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ) 29-26తో శ్రీనిధి స్కూల్‌పై చెమటోడ్చి నెగ్గగా, జాన్సన్ గ్రామర్ స్కూల్ 14-13తో గీతాంజలి స్కూల్‌ను ఓడించింది. సీనియర్ బాలికల పోటీల్లో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి) 14-12తో సెయింట్ జార్జ్‌స్ స్కూల్‌పై, సెయింట్ ఆన్స్ 6-0తో షేర్‌వుడ్ స్కూల్‌పై, ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్ 12-2తో గీతాంజలిపై గెలుపొందాయి. జూనియర్ బాలికల విభాగంలో హెచ్‌పీఎస్ 15-3తో సెయింట్ జోసెఫ్ (మలక్‌పేట్)పై, ఫ్యూచర్ కిడ్స్ 14-0తో శ్రీ అరబిందోపై, సెయింట్ ఆన్స్ 20-2తో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి)పై గెలిచాయి.
సత్తాచాటిన హెచ్‌పీఎస్
Published Fri, Aug 23 2013 11:59 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement