ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆజాదీ వన్డే ఇంటర్ స్కూల్ హాకీ టైటిల్‌ను గచ్చిబౌలికి చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) స్కూల్ జట్టు చేజిక్కించుకుంది. జింఖానా హాకీ మైదానంలో గురువారం జరిగిన ఫైనల్లో గచ్చిబౌలి కేవీ స్కూల్ జట్టు 1-0 స్కోరుతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టుపై విజయం సాధించింది.
తొలి అర్ధభాగంలో కేవీ స్కూల్ జట్టు ఆటగాడు విశ్వజిత్ 15వ నిమిషంలో చే సి ఏకైక గోల్‌తో ఆ జట్టు విజయాన్ని నమోదు చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో బీహెచ్‌ఈఎల్ స్కూల్ జట్టు 5-2 స్కోరుతో గచ్చిబౌలి కేవీ-2 స్కూల్ జట్టుపై గెలిచింది. ఈ పోటీలను ఇంటర్నేషనల్ హాకీ కోచ్ మధుకర్ లాంఛనంగా ప్రారంభించారు. ముగింపు వేడుకలకు విచ్చేసిన బాక్సింగ్ అవార్డు గ్ర హీత జయరామ్ ట్రోఫీలను అందజేశారు.
గచ్చిబౌలి కేవీకి హాకీ టైటిల్
Published Fri, Aug 16 2013 12:33 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement