
సాక్షి, హైదరాబాద్: కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాలపై రామశాస్త్రి రచించిన ‘విశ్వనాథ్ విశ్వరూపం’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. కె.విశ్వనాథ్ చేతుల మీదగా ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణలో సభలో పాల్గొన్న తనికెళ్ల భరణి మాట్లాడుతూ, విశ్వనాథ్ అంటే అందరికీ ఉండే అభిమానం, ప్రేమ.. రచయిత రామశాస్త్రి విషయంలో భక్తిగా మారిందన్నారు. విశ్వనాథ్ సినిమాలని పరమ పవిత్రమైన మనస్సుతో చూసి, పరిశీలించి, పరీక్షించి, పరామర్శించి, పరవశం చెంది ఈ పుస్తకం రాశారన్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ మాట్లాడుతూ.. తన చిత్రాల మీద సమగ్రమైన థీసిస్ వంటి రచన చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ పుస్తకం రాయటం ఎంతో కష్టమైన పని అన్నారు.