
నటిగా, భార్యగా, తల్లిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. గ్లామర్ లుక్, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆలియా తాజాగా రచయిత్రిగా తొలి పుస్తకాన్ని ఆవిష్కరించింది. దివంగత తాతయ్య నరేంద్రనాథ్ రజ్దాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్(‘Ed Finds a Home)'ను ఆదివారం తీసుకొచ్చింది.
పిల్లల కోసం స్పెషల్‌గా పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాకు చెందిన పఫిన్ భాగస్వామ్యంతో పిల్లల కథల పుస్తకాన్ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆలియా పిల్లలతో ముచ్చటించింది. అలాగే ఆలియా కుమార్తె రాహాకపూర్ కోసం చిన్నారులు తీసుకొచ్చిన బహుమతులను స్వీకరించింది. ఈ లాంచింగ్‌కు ఆలియా తల్లి సోనీ రజ్దాన్ సోదరి షాహీన్ భట్ హాజరయ్యారు.
ముంబైలోని స్టోరీవర్స్ చిల్డ్రన్స్ లిటరరి ఫెస్ట్‌లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తన బాల్యం నుంచీ తన జీవితం కథలు, స్టోరీ టెల్లింగ్ చుట్టూ అల్లుకొని ఉందని, తన బాల్యాన్ని, పిల్లలకోసం వెలికి తీయాలని కలలు కన్నాననీ, ఇది ప్రారంభం మాత్రమే..ఈ బుక్ సిరీస్‌గా ఉండబోతోందని ఆలియా ఇన్‌స్టాలో వెల్లడించింది.

ఈ సందర్బంగా ఆలియా బటర్ ఎల్లో ఫ్లోరల్ ప్రింటెడ్ గౌనులో ఆకట్టుకుంది. సీబీ బ్రాండ్‌కు చెందిన లోలిత పేరుతో ఉన్న ఈ ఎల్లో కలర్ పూల గౌను ధర రూ. 17,901 లట. ఇప్పటికే ‘ఎడ్-ఎ-మమ్మా’ పేరుతో కిడ్స్ వేర్ బ్రాండ్‌ను నడుపుతున్న సంగతి తెలిసిందే.
కాగా కరణ్ జోహార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్‌తో కలిసి రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ మూవీలో నటించిన ఆలియా ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే బ్రహ్మాస్త్ర-2లో కూడా కనిపించనుంది. ది ఆర్చీస్ ఫేమ్ వేదాంగ్ రైనాతో కలిసి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'జిగ్రా' ఈ అక్టోబర్‌లో విడుదల కానుంది
Comments
Please login to add a commentAdd a comment