
కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు గైడ్లూ, టూరిస్టు బ్రోషర్లు భట్టీయం పట్టకపోయినా కనీసం గూగుల్‌ని సంప్రదించి ఆయా ప్రదేశాల మీద ఒక అవగాహన ఏర్పరచుకోవడం నాకు అలవాటు. థాయ్‌లాండ్ విషయంలో ఉదాసీనత వల్లే అనుకొంటాను, ఆ పని చెయ్యలేదు. అది చివరికి గొప్ప మేలు చేసిందని క్రమ క్రమంగా అర్థమయింది. అధ్యయనం చేసి వెళితే ఆ ప్రదేశం మీదా అక్కడి మనుషులూ సంస్కృతి మీదా ఒక పూర్వ నిర్ధారిత అభిప్రాయంతో వెళతాం. ఆ అభిప్రాయానికి అనుగుణంగానూ బలపరచేలానూ ఉండే వివరాలూ అనుభవాల కోసం తెలియకుండానే వెదుకుతాం. ఒక్క క్వాయ్ నది మీది వంతెన గురించి తప్ప థాయ్‌లాండ్‌లోని అయుత్తయ్య (అయోధ్య అన్నమాటకు అక్కడి స్థానిక రూపం)లూ, కాంచనబురిల గురించి ఏ మాత్రమూ తెలియకుండా, తెలుసుకోకుండా వెళ్లడం వల్ల అక్కడ కనిపించిన అన్ని వివరాలనూ, అన్ని అనుభవాలనూ తిన్నగా సూటిగా మనసులో ఇంకించుకోగలిగాను. ఒక యాత్రికుడిగా ఇది కొత్త అనుభవం. ఇంకా చెప్పాలంటే ఒక కనువిప్పు.
అనగనగా ఒక రాజ్యం
(థాయ్‌లాండ్ యాత్రాగాథ)
రచన: దాసరి అమరేంద్ర;
పేజీలు: 142; వెల: 140;
ప్రచురణ: ఆలంబన ప్రచురణలు,
హెచ్‌ఐజి 85, ఏపీహెచ్‌బీ
కాలనీ, బాలాజీ నగర్,
కూకట్‌పల్లి, హైదరాబాద్–72. ఫోన్: 040–23055904
Comments
Please login to add a commentAdd a comment