అతి చిన్న పుస్తకంలో చిరంజీవి చరిత్ర | mrs Universe Himaja Naidu Record Chiranjeevi Story in Small Book | Sakshi
Sakshi News home page

అతి చిన్న పుస్తకంలో చిరంజీవి చరిత్ర

Published Thu, Mar 12 2020 12:19 PM | Last Updated on Thu, Mar 12 2020 12:19 PM

mrs Universe Himaja Naidu Record Chiranjeevi Story in Small Book - Sakshi

హిమాయత్‌ నగర్‌ : ప్రపంచంలోనే అతి చిన్న పుస్తకాన్ని రాసి 50 ప్రపంచ రికార్డులను ఓ తెలుగు మహిళ సొంతం చేసుకుంది. మాజీ మిసెస్‌ యూనివర్స్‌ హిమజా నాయుడు బొటన వేలిపై ఇమిడిపోయే పుస్తకంలో చిరంజీవి గురించి పొందుపరచింది. ఆమె రాసిన పుస్తకాలను బుధవారం బషీర్‌ బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో భారత్‌ ఆర్ట్స్‌ అకాడమి , ఏబీసీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  ప్రదర్శించారు. ఈ సందర్భంగా వరల్డ్‌ రికార్డ్స్‌ కో ఆర్డినేటర్‌ కేవీ రమణ రావు హిమాజా నాయుడు పేరిట 50 ప్రపంచ రికార్డులను అందజేశారు.  ఈ సందర్భంగా మరేడుపల్లికి చెందిన అవార్డు గ్రహీత హిమజా నాయుడు మాట్లాడుతూ... ఈ పుస్తకాలు రాయడానికి ఏడు రోజులు సమయం పట్టిందన్నారు. ఒక్కో పేజీలో నాలుగు పదాలను రాసినట్లు వివరించారు. బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ బీఎస్‌ రాములు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement