
లాక్‌డౌన్ సమయాన్ని సెలబ్రిటీలు చక్కగా వినియోగించుకుంటున్నారు. నచ్చిన పనులు చేయడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, కొత్త సినిమాల కోసం కథలు వినడం, పెండింగ్ పనులు పూర్తి చేయడం, ఇష్టమైన పనులు నేర్చుకోవడం వంటివన్నీ చేసేస్తున్నారు.ఇక ఎప్పుడూ బిజీగా ఉండే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూడా కరోనా పుణ్యమా అని ఖాళీ అయిపోయాడు. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడు. వీటితో పాటు పుస్తకాలు కూడా చదువుతున్నాడు. (చదవండి : ప్రభాస్ సినిమాలో కనిపించనున్న రానా!)
తాజాగా, పుస్తక ప్రపంచంలో ఎంతో పేరున్న డానియల్ గోల్ మేన్ రాసిన 'ఎమోషనల్ ఇంటెలిజన్స్' అనే పుస్తకాన్ని చదువుతున్నాడు. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 'ఎమోషనల్ ఇంటెలిజన్స్.. సైంటిఫిక్ .. సంచలనాత్మకం.. అందరూ చదవాల్సిన పుస్తకం. ఇక ఈ వారం అంతా డానియల్ గోల్ మెన్ కే కేటాయిస్తున్నా..' అంటూ మహేశ్ ఆ పుస్తకాన్ని చదువుతున్న విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment