ప్రపంచీకరణ లేదా గ్లోబలైజషన్ అనే పదాలను గూర్చి తరచుగా వింటున్నాం. సామాన్యుల పరంగా దీన్ని నిర్వచిస్తే..ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలు, జ్ఞానం, సమాచారం, ఉత్పత్తులు, సేవల విస్తరణ. బిజినెస్ పరంగా, ఆర్థికపరంగా వాటి అర్థం మారుతుందేమో గానీ అంతిమంగా మాత్రం మొత్తం ప్రపంచాన్ని ఒకచోటే చేర్చే సాధారణ పదంగా చెప్పవచ్చు. ఓ పల్లెలో చిన్న కుటుంబం పెద్దదిగా విస్తరించి ఎలా ప్రపంచీకరణవైపు అడుగులు వేస్తోందో చూస్తే.. కచ్చితంగా ప్రతి కుటుంబంలో ఇలానే జరగుతోంది కదా అనిపిస్తుంది. మనం గమనించకుండా మాటిమాటికి ప్రంపచీకరణ(గ్లోబలైజషన్ ) అని జపించామా! అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ రచయిత ఆ అంశంపై పుస్తకం రాసేంతవరకు కూడా..అందుకు తన కుటుబ గాథే ఓ చిన్న ఉదహారణ అని ఆ సమయంలో గ్రహించలేకపోయాడు. నిశితంగా గమనిస్తే..ఆ రచయిత కుటుంబంలానే ప్రతి కుటుంబం ప్రపంచీకరణ వైపు అడుగులు వేస్తుందని అవగతమవుతోంది. ఆ రచయిత ఎవరూ? ఆ పుస్తకంలోని కథా కమామీషు ఏమిటంటే..
స్వామినాథన్ శంకర్ అంక్లేసరియా అయ్యర్ అనే వ్యక్తి 1992లో 'ప్రపంచీకరణ వైపు' (Towards Globalisation) అనే పుస్తకాన్ని రాశారు. ఆయనో ఓ జర్నలిస్ట్, కాలమిస్ట్ కూడా. ఐతే ఆయనకు ఆ పుస్తకం రాసేంత వరకు తెలియలేదు, అందుకు తన కుటుంబ నేపథ్యమే ఓ ఉదహారణ అని. ఈ మేరకు రచయిత స్వామినాథన్ ఆ పుస్తకంలో తన కుటుంబం ప్రపంచీకరణ వైపు ఎలా అడుగులు వేసిందో చెబుతూ..నా కుమార్తె తెలివైన విద్యార్థి. ఆమె లండన్ స్కూల ఆఫ్ ఎకనామిక్స్‌లో స్కాలర్‌షిప్ గెలుచుకుంది. లండన్‌లో ఆమెకు స్పెయిన్‌కు చెందిన జూలియా అను యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరు చైనాలో బీజింగ్‌లో ఉద్యోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. వివాహాం చేసుకోవడానికి ఢిల్లీకి వచ్చారు. వివాహ అతిధుల్లో ఉత్తర అమెరికా, యూరప్, చైనాకు చెందిన 70 మంది స్నేహితులు ఉన్నారు. ఈ వివాహంలో మొత్తం ప్రపంచమే కవర్ అయ్యిందనుకుంటే రచయిత పెద్ద కొడుకు శేఖర్ ఇంకాస్త ముందడుగు వేసి ఊహించని షాక్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు రచయిత స్వామినాథన్.
ఇక అతను కూడా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్ సాధించాడు. ఆ తర్వాత కొలంబోలో ఒక పాఠశాలలో ఒక ఏడాదిపాటు బోధించి తదనంతరం ఉన్నత చదువుల కోసం కెనడాలోని టొరంటో వెళ్లాడు. అతను అక్కడ ఫ్రాంజిస్కా అనే జర్మన్ అమ్మాయి పరిచయమయ్యింది. ఇద్దరూ యూఎస్‌ఏలోని వాషింగ్టన్ డీసీలోని అంతర్జాతీయ ద్రవ్యనిధిలో ఉద్యోగాలు పొందారు. అదీగాక ఐఎంఎఫ్‌లో ఉద్యోగాల రీత్యా విభిన్న దేశాలకు ప్రయాణించారు. ఇక 2003 చివరిలో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక చిన్న కొడుకు రుస్తమ్ వయసు కేవలం 15 ఏళ్లు అని, బహుశా ఆస్ట్రేలియాలో చదువుకుని, నైజీరియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని పెరులో స్థిరపడతాడేమో అని చమత్కరించాడు. వాస్తవానికి రచయిత స్వామినాథన్ పూర్వికులు ఇల్లు తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని ఒక చిన్న కుగ్రామం కర్గుడి. కనీసం మరుగుదొడ్లు, తాగునీరు, పక్కా రోడ్డు వంటి సౌకర్యాలు లేని ప్రదేశంలో ఉంది.
అయ్యర్ల కుటుంబం నుంచే 50 మంది..
తంజావూర్‌లో తనకు రైలు దిగి, ఎద్దుల బండి ఎక్కి 45 నిమిషాలు ప్రయాణిస్తే పూర్వీకులు ఇల్లు చేరుకోవచ్చు. రచయిత తండ్రి ఆరుగురు సంతానంలో ఒకడు. వీరందరికి చాలామంది పిల్లలు ఉన్నారు. రెండు తరాల తర్వాత కర్గుడిలోని ఆ కుటుంబం కాస్త పెద్దదై క్రమంగా 200 మందికి పైగా చేరుకుంది. ప్రస్తుతం వీరిలో ముగ్గురు మాత్రమే గ్రామంలో నివశిస్తున్నారు. మిగిలిన వారు భారతదేశంతో సహా ప్రపంచమంతటా వేర్వేరు చోట్ల సెటిల్ అయ్యారు. తమ కుటుంబమే ఇప్పటికి సుమారు 50 మంది అమెరికన్ పౌరులను తయారు చేసినట్లు రచయిత చెప్పుకొచ్చాడు.
దీన్ని గమనిస్తే..గ్లోబలైజేషన్ అంటే పాశ్చాత్యీకరణ అని వాదించే వాదనలు ఒక్కసారిగా కొట్టిపారేయొచ్చు. కఠినమైన తమిళ బ్రాహ్మణ అయ్యర్ల నేపథ్యం కుటుంబం ఒక్కసారిగా ఎంతలా హైప్ తీసుకుని విస్తరించిన తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది అయ్యర్ ఆధిపత్యం కాదు. దీని అర్థం ఒక వ్యక్తి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసి ఎలా దురాబారాలను అధిగమించి వెళ్తాడో..ఆ క్రమంలో ఎలా ప్రపంచంలోని ప్రదేశాలను చుట్టివచ్చి..ఎలా పరివర్తనం చెందుతాడనేది తెలుపుతోంది.
వాస్తవానికి రచయిత స్వామినాథన్ కర్గుడి గ్రామంలో ఉంటే తన ఇంటిలో నేలపై చేతితో భోజనం చేస్తాడు. అదే..చైనాలో నూడుల్స్, స్పెయిన్‌లో స్టీక్, జపాన్‌లో టెరియాకి, మొరాకోలో కౌస్-కస్ తినగలడు. రచయిత స్వామినాథన్ తాను కార్గుడి గ్రామస్థుడిని, తమిళుడిని, ఢిల్లీ-వాలాను, భారతీయుడిని, వాషింగ్టన్ రెడ్‌స్కిన్స్ అభిమానిని, ప్రపంచ పౌరుడిని అని గర్వంగా చెబుతున్నాడు. తన పుట్టిన తంజావురూలోని బృహదీశ్వరాలయాన్ని చూడగానే తన హృదయం ఉప్పొంగుతుందని, ఇది నా మాతృభూమి అనే గర్వంగా చెప్పుకుంటానని భావోద్వేగంగా అన్నాడు. అలాగే భారత్‌లోని వివిధ ప్రదేశాలలో తాను నివశించిన వాటిని చూసినా అది నాదే అన్నభావం కలుగుతుంది. అంతేగాదు విదేశాల్లో తాను గడిపిన ఆయా ప్రదేశాల్లోని ప్రాంతాలను చూసినా అవి నాలో ఒక భాగమని ఫీలవుతానని రచయిత స్వామినాథన్ చెబుతున్నారు.
ప్రపంచమంతా ఒక్కటే..
ఇక్కడ రచయిత నాన్న తరం మొదటగా గ్రామాన్ని విడిచిపెట్టి ప్రాంతీయ సంకెళ్లను తెంచుకోవడంతో..స్వామినాథన్ నాన్న లాహోర్‌లో చార్టర్ అకౌంటెంట్ అయ్యాడు. మామయ్య కరాచీలో హోటల్ మేనేజర్ అయ్యాడు. రంగూన్‌లో అతని అత్త సెటిల్ అయ్యింది. రచయిత తరం వచ్చేటప్పటికీ మతం సంకెళ్లను వదులుకుంది. రచయిత అన్నయ్య సిక్కును, తమ్ముడు క్రిస్టియన్‌ని, రచయిత స్వామినాథన్ అయ్యంగర్ పార్శిని పెళ్లి చేసుకుంటే..తరువాతి తరం ప్రపంచవ్యాప్తంగా పెళ్లి చేసుకుంటూ ఒక అడుగు ముందుకు వేసింది. ఇది కేవలం ఒక్క అయ్యర్ కుటుంబంలోనో ప్రపంచీకరణ జరిగి వస్తువులు, మూలధనం తరలింపు జరగలేదు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి కుటుంబంలో ఒకరో ఇద్దరో అటు వైపు అడుగులు వేస్తూ.. అయ్యర్ కుటుంబం కోవలోకే చేరుతున్నారు. ఈ ప్రపంచీకరణ ఒకరకంగా విభిన్న భాష, సంస్కృతులు సంప్రదాయాల మేళవింపుతో ఒక్కటై ప్రంపంచమంతా ఒక్కటి అనే స్ఫురణను తీసుకొస్తుంది. దీని వల్ల ఒక ప్రాంతీయ భాష, సంప్రదాయాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ..మత విద్వేషాలకు చెక్ పెట్టి మనం అంతా ఒక్కటే అనే ఎలుగెత్తి చాటుతోందని స్వామినాథన్ తన పుస్తకంలో వివరించారు.
(చదవండి: On This Day April 15th: ఏప్రిల్ 15 ముఖ్య సంఘటనలు, విశేషాలు ఇవే!)
Comments
Please login to add a commentAdd a comment