written
-
పవన విద్యుత్‌లో అడ్డగోలు ఒప్పందాలు
సాక్షి, అమరావతి : పవన విద్యుత్ కొనుగోళ్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలు ఒప్పందాలు చేసుకుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వద్దని ఆ రంగ నిపుణులు మార్చి 1, 2017న అప్పటి టీడీపీ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా నివేదించినా పవన విద్యుత్ పీపీఏలకు చంద్రబాబు సర్కారు పచ్చజెండా ఊపేసింది. అది కూడా రెట్టింపు కంటే అధిక ధరకు కొనుగోలు చేసేందుకు. గుజరాత్లో తక్కువకే పవన విద్యుత్ దొరుకుతున్నా ఇలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి పీపీఏలు ఎందుకు కుదుర్చుకున్నారు? పోనీ రాష్ట్రంలో ఏమన్నా విద్యుత్ కొరత ఉందా అంటే అప్పటికి ఆ పరిస్థితి కూడా లేదు. కేవలం ముడుపుల కోసమే పవన విద్యుత్ పీపీఏలు కుదుర్చుకున్నారు. అప్పట్లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏ మాత్రం పెరగలేదు. పైగా కొరతనేదే లేదు. అయినా అధిక ధర చెల్లించి ప్రైవేట్ పవన విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంకావటవల్ల విద్యుత్ సంస్థలపై పెద్దఎత్తున ఆర్థిక భారం పడింది. ఇలాంటి నష్టదాయకమైన పీపీఏల ఫలితంగా థర్మల్ విద్యుత్ యూనిట్ల ఉత్పత్తి వ్యయంతోపాటు అప్పులు కూడా పెరిగాయి. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. తక్కువకే దొరుకుతున్నా.. టీడీపీ హయాంలో పవన విద్యుత్ ఏడాదికి 6 వేల మిలియన్ యూనిట్లకు పైగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. పోటీ పెరగడంతో అన్ని రాష్ట్రాల్లో ఈ పవన విద్యుత్ ధరలు తగ్గుతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రాలు నష్టదాయకమైన పీపీఏలకు దూరంగా ఉంటున్నాయి. చౌకగా లభించే చోటే విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. గుజరాత్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇఫ్ ఇండియా (సెకీ) ఓపెన్ బిడ్డింగ్‌కి పిలవగా పవన విద్యుత్ యూనిట్ రూ.2.48 చొప్పున 500 మెగావాట్లను సరఫరా చేస్తామని ఉత్పత్తిదారులు ముందుకొచ్చారు. స్ప్రింగ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, కేసీ ఎనర్జీ లిమిటెడ్ రూ.1.43కి సరఫరా చేస్తామన్నాయి. అంటే ఆ రేటుకు కొనుగోలు చేసేందుకు మనకూ అవకాశముంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు పీపీఏలలో సిద్ధపడింది. అంటే ఒక్కో యూనిట్‌కు రూ.3.41 చొప్పున అదనంగా ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ తయారైపోయింది. ప్రైవేటుకు దోచిపెట్టింది రూ.11,375 కోట్లు.. పవన విద్యుత్ పీపీఏలను 25 ఏళ్లకు కుదుర్చుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను నాటి టీడీపీ ప్రభుత్వం ఆదేశించింది. 11 పీపీఏల ద్వారా మొత్తం 840 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఒక్కో మెగావాట్‌కు 2.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తుంది. 810 మెగావాట్లకు 1,232 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు డిస్కంలకు ప్రైవేట్ సంస్థలు అంటగట్టాయి. ఇలా ఒక్కో యూనిట్‌కు అదనంగా రూ.3.41 చెల్లించటం ద్వారా 1,372 మిలియన్ యూనిట్లకు ఏటా రూ.455 కోట్లు అప్పనంగా ప్రైవేటు సంస్థలకు ఇవ్వాల్సి వస్తోంది. 25 ఏళ్లకు చెల్లించే అదనపు వ్యయం రూ.11,375 కోట్లు. ఎలాంటి బిడ్డింగు లేకుండా ప్రైవేటు విద్యుత్ సంస్థలకు ఇంత భారీ మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడడానికి కారణం భారీగా ముడుపులు చేతులు మారడమే. పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తొలుత అభ్యంతరాలు వ్యక్తంచేసిన రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ ఆ తర్వాత ఆమోదం తెలపడం వెనక కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంది. విద్యుత్ ఉత్పత్తిదారులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన తర్వాత ప్రైవేట్ పవన విద్యుత్ కొనుగోలుకు ఆమోదం లభించిడం ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది. అసలు అదనపు విద్యుత్ అవసరమేలేదు.. రాష్ట్రంలో 2017–18లో 57 వేల మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అందనా వేస్తే వాస్తవ వినియోగం 52 వేల మిలియన్ యూనిట్లు దాటలేదు. 2018–19 కూడా డిస్కంలు ఇదే స్థాయిలో 61 వేల మిలియన్ యూనిట్లు అవసరం ఉంటుందని అంచనా చేశాయి. అయినప్పటికీ ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు ఏపీ జెన్కో థర్మల్, హైడల్ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 156 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే థర్మల్ ద్వారా 98 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. కేంద్రం నుంచి చౌకగా మరో 18 మిలియన్ యూనిట్లు అందుతున్నాయి. జల విద్యుత్ ద్వారా 17 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశముంది. వీటి ద్వారా యూనిట్ విద్యుత్ సగటున రూ.3.50లోపే లభిస్తుంది. డిమాండ్ కంటే ఇంకా ఐదు మిలియన్ యూనిట్లు మిగులు ఉండే అవకాశముంది. అలాంటప్పుడు డిమాండ్ లేకుండా పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరంలేదు. ఇదీ రాష్ట్రంలో పవన విద్యుత్ పరిస్థితి.. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4,096.65 మెగావాట్లు. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే.. జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయెరాలజీ (పూణే)కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు.. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్టు (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. ఇలాంటి అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని, రానున్నాయని ముందే నిపుణులు చెప్పినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వినకుండా పాతికేళ్లకు పీపీఏలు కుదుర్చుకుంది. -
పోలవరం నిధులపై అభ్యంతరం చెప్పలేదు
పోలవరం ప్రాజెక్ట్‌లో 41.15 మీటర్ల వరకూ నీటిని నింపడానికి రూ.10,911.15 కోట్లు వరద నష్టం రూ.2 వేల కోట్లు నిధులకు ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పలేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జనవిశ్వాస్ బిల్లుకు మద్దతు లోక్‌సభలో కేంద్రం గురువారం ప్రవేశపెట్టిన జన విశ్వాస్ సవరణ బిల్లు, 2022కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. దేశంలో జీవన సౌలభ్యానికి బిల్లు ఎంతో తోడ్ప డుతుందన్నారు. బిల్లులో కొన్ని మార్పులను ఎంపీ సత్యవతి సూచించారు. తిట్టలేదు.. అవాస్తవాల ప్రచారంపై ప్రశ్నించానంతే: ఎంపీ ఎంవీవీ తనతో పాటు తన కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగేలా మీడియాతో మాట్లాడిన వ్యవహారంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కేవలం ప్రశ్నించాను తప్ప అసభ్య పదజాలంతో తిట్టలేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. తనపై చేసిన అసత్య ప్రచారంపై రఘురామను నిలదీశానని, వాస్తవాలు తెలియకుండా ఇష్టానురీతిన ఎలా మాట్లాడుతారని ప్రశ్నించినట్టు తెలిపారు. ఈ నెల 20న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ వాయిదా పడిన అనంతరం సెంట్రల్ హాల్లో తనను అసభ్య పదజాలంతో తిడుతూ.. చంపేస్తాననే ధోరణిలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాకు ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఎంవీవీ సత్యనారాయణ స్పందిస్తూ.. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని కొట్టిపారేశారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతంపై రఘురామ తలాతోక లేని ఆరోపణలు చేశారని విమర్శించారు. -
ఓ పల్లెలోని చిన్న కుటుంబం..ప్రపంచీకరణ వైపు ఎలా అడుగులు వేసిందంటే..
ప్రపంచీకరణ లేదా గ్లోబలైజషన్ అనే పదాలను గూర్చి తరచుగా వింటున్నాం. సామాన్యుల పరంగా దీన్ని నిర్వచిస్తే..ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలు, జ్ఞానం, సమాచారం, ఉత్పత్తులు, సేవల విస్తరణ. బిజినెస్ పరంగా, ఆర్థికపరంగా వాటి అర్థం మారుతుందేమో గానీ అంతిమంగా మాత్రం మొత్తం ప్రపంచాన్ని ఒకచోటే చేర్చే సాధారణ పదంగా చెప్పవచ్చు. ఓ పల్లెలో చిన్న కుటుంబం పెద్దదిగా విస్తరించి ఎలా ప్రపంచీకరణవైపు అడుగులు వేస్తోందో చూస్తే.. కచ్చితంగా ప్రతి కుటుంబంలో ఇలానే జరగుతోంది కదా అనిపిస్తుంది. మనం గమనించకుండా మాటిమాటికి ప్రంపచీకరణ(గ్లోబలైజషన్ ) అని జపించామా! అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ రచయిత ఆ అంశంపై పుస్తకం రాసేంతవరకు కూడా..అందుకు తన కుటుబ గాథే ఓ చిన్న ఉదహారణ అని ఆ సమయంలో గ్రహించలేకపోయాడు. నిశితంగా గమనిస్తే..ఆ రచయిత కుటుంబంలానే ప్రతి కుటుంబం ప్రపంచీకరణ వైపు అడుగులు వేస్తుందని అవగతమవుతోంది. ఆ రచయిత ఎవరూ? ఆ పుస్తకంలోని కథా కమామీషు ఏమిటంటే.. స్వామినాథన్ శంకర్ అంక్లేసరియా అయ్యర్ అనే వ్యక్తి 1992లో 'ప్రపంచీకరణ వైపు' (Towards Globalisation) అనే పుస్తకాన్ని రాశారు. ఆయనో ఓ జర్నలిస్ట్, కాలమిస్ట్ కూడా. ఐతే ఆయనకు ఆ పుస్తకం రాసేంత వరకు తెలియలేదు, అందుకు తన కుటుంబ నేపథ్యమే ఓ ఉదహారణ అని. ఈ మేరకు రచయిత స్వామినాథన్ ఆ పుస్తకంలో తన కుటుంబం ప్రపంచీకరణ వైపు ఎలా అడుగులు వేసిందో చెబుతూ..నా కుమార్తె తెలివైన విద్యార్థి. ఆమె లండన్ స్కూల ఆఫ్ ఎకనామిక్స్‌లో స్కాలర్షిప్ గెలుచుకుంది. లండన్‌లో ఆమెకు స్పెయిన్‌కు చెందిన జూలియా అను యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరు చైనాలో బీజింగ్‌లో ఉద్యోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. వివాహాం చేసుకోవడానికి ఢిల్లీకి వచ్చారు. వివాహ అతిధుల్లో ఉత్తర అమెరికా, యూరప్, చైనాకు చెందిన 70 మంది స్నేహితులు ఉన్నారు. ఈ వివాహంలో మొత్తం ప్రపంచమే కవర్ అయ్యిందనుకుంటే రచయిత పెద్ద కొడుకు శేఖర్ ఇంకాస్త ముందడుగు వేసి ఊహించని షాక్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు రచయిత స్వామినాథన్. ఇక అతను కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ సాధించాడు. ఆ తర్వాత కొలంబోలో ఒక పాఠశాలలో ఒక ఏడాదిపాటు బోధించి తదనంతరం ఉన్నత చదువుల కోసం కెనడాలోని టొరంటో వెళ్లాడు. అతను అక్కడ ఫ్రాంజిస్కా అనే జర్మన్ అమ్మాయి పరిచయమయ్యింది. ఇద్దరూ యూఎస్ఏలోని వాషింగ్టన్ డీసీలోని అంతర్జాతీయ ద్రవ్యనిధిలో ఉద్యోగాలు పొందారు. అదీగాక ఐఎంఎఫ్‌లో ఉద్యోగాల రీత్యా విభిన్న దేశాలకు ప్రయాణించారు. ఇక 2003 చివరిలో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక చిన్న కొడుకు రుస్తమ్ వయసు కేవలం 15 ఏళ్లు అని, బహుశా ఆస్ట్రేలియాలో చదువుకుని, నైజీరియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని పెరులో స్థిరపడతాడేమో అని చమత్కరించాడు. వాస్తవానికి రచయిత స్వామినాథన్ పూర్వికులు ఇల్లు తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని ఒక చిన్న కుగ్రామం కర్గుడి. కనీసం మరుగుదొడ్లు, తాగునీరు, పక్కా రోడ్డు వంటి సౌకర్యాలు లేని ప్రదేశంలో ఉంది. అయ్యర్ల కుటుంబం నుంచే 50 మంది.. తంజావూర్లో తనకు రైలు దిగి, ఎద్దుల బండి ఎక్కి 45 నిమిషాలు ప్రయాణిస్తే పూర్వీకులు ఇల్లు చేరుకోవచ్చు. రచయిత తండ్రి ఆరుగురు సంతానంలో ఒకడు. వీరందరికి చాలామంది పిల్లలు ఉన్నారు. రెండు తరాల తర్వాత కర్గుడిలోని ఆ కుటుంబం కాస్త పెద్దదై క్రమంగా 200 మందికి పైగా చేరుకుంది. ప్రస్తుతం వీరిలో ముగ్గురు మాత్రమే గ్రామంలో నివశిస్తున్నారు. మిగిలిన వారు భారతదేశంతో సహా ప్రపంచమంతటా వేర్వేరు చోట్ల సెటిల్ అయ్యారు. తమ కుటుంబమే ఇప్పటికి సుమారు 50 మంది అమెరికన్ పౌరులను తయారు చేసినట్లు రచయిత చెప్పుకొచ్చాడు. దీన్ని గమనిస్తే..గ్లోబలైజేషన్ అంటే పాశ్చాత్యీకరణ అని వాదించే వాదనలు ఒక్కసారిగా కొట్టిపారేయొచ్చు. కఠినమైన తమిళ బ్రాహ్మణ అయ్యర్ల నేపథ్యం కుటుంబం ఒక్కసారిగా ఎంతలా హైప్ తీసుకుని విస్తరించిన తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది అయ్యర్ ఆధిపత్యం కాదు. దీని అర్థం ఒక వ్యక్తి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసి ఎలా దురాబారాలను అధిగమించి వెళ్తాడో..ఆ క్రమంలో ఎలా ప్రపంచంలోని ప్రదేశాలను చుట్టివచ్చి..ఎలా పరివర్తనం చెందుతాడనేది తెలుపుతోంది. వాస్తవానికి రచయిత స్వామినాథన్ కర్గుడి గ్రామంలో ఉంటే తన ఇంటిలో నేలపై చేతితో భోజనం చేస్తాడు. అదే..చైనాలో నూడుల్స్, స్పెయిన్‌లో స్టీక్, జపాన్‌లో టెరియాకి, మొరాకోలో కౌస్-కస్ తినగలడు. రచయిత స్వామినాథన్ తాను కార్గుడి గ్రామస్థుడిని, తమిళుడిని, ఢిల్లీ-వాలాను, భారతీయుడిని, వాషింగ్టన్ రెడ్స్కిన్స్ అభిమానిని, ప్రపంచ పౌరుడిని అని గర్వంగా చెబుతున్నాడు. తన పుట్టిన తంజావురూలోని బృహదీశ్వరాలయాన్ని చూడగానే తన హృదయం ఉప్పొంగుతుందని, ఇది నా మాతృభూమి అనే గర్వంగా చెప్పుకుంటానని భావోద్వేగంగా అన్నాడు. అలాగే భారత్‌లోని వివిధ ప్రదేశాలలో తాను నివశించిన వాటిని చూసినా అది నాదే అన్నభావం కలుగుతుంది. అంతేగాదు విదేశాల్లో తాను గడిపిన ఆయా ప్రదేశాల్లోని ప్రాంతాలను చూసినా అవి నాలో ఒక భాగమని ఫీలవుతానని రచయిత స్వామినాథన్ చెబుతున్నారు. ప్రపంచమంతా ఒక్కటే.. ఇక్కడ రచయిత నాన్న తరం మొదటగా గ్రామాన్ని విడిచిపెట్టి ప్రాంతీయ సంకెళ్లను తెంచుకోవడంతో..స్వామినాథన్ నాన్న లాహోర్‌లో చార్టర్ అకౌంటెంట్ అయ్యాడు. మామయ్య కరాచీలో హోటల్ మేనేజర్ అయ్యాడు. రంగూన్లో అతని అత్త సెటిల్ అయ్యింది. రచయిత తరం వచ్చేటప్పటికీ మతం సంకెళ్లను వదులుకుంది. రచయిత అన్నయ్య సిక్కును, తమ్ముడు క్రిస్టియన్ని, రచయిత స్వామినాథన్ అయ్యంగర్ పార్శిని పెళ్లి చేసుకుంటే..తరువాతి తరం ప్రపంచవ్యాప్తంగా పెళ్లి చేసుకుంటూ ఒక అడుగు ముందుకు వేసింది. ఇది కేవలం ఒక్క అయ్యర్ కుటుంబంలోనో ప్రపంచీకరణ జరిగి వస్తువులు, మూలధనం తరలింపు జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి కుటుంబంలో ఒకరో ఇద్దరో అటు వైపు అడుగులు వేస్తూ.. అయ్యర్ కుటుంబం కోవలోకే చేరుతున్నారు. ఈ ప్రపంచీకరణ ఒకరకంగా విభిన్న భాష, సంస్కృతులు సంప్రదాయాల మేళవింపుతో ఒక్కటై ప్రంపంచమంతా ఒక్కటి అనే స్ఫురణను తీసుకొస్తుంది. దీని వల్ల ఒక ప్రాంతీయ భాష, సంప్రదాయాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ..మత విద్వేషాలకు చెక్ పెట్టి మనం అంతా ఒక్కటే అనే ఎలుగెత్తి చాటుతోందని స్వామినాథన్ తన పుస్తకంలో వివరించారు. (చదవండి: On This Day April 15th: ఏప్రిల్ 15 ముఖ్య సంఘటనలు, విశేషాలు ఇవే!) -
కుడి నుంచి ఎడమకి ఐదుభాషల్లో హనుమాన్ చాలీసా
తూర్పుగోదావరి: అందరూ ఎడమ నుంచి కుడి వైపుకు రాస్తారు. కానీ ఓ పురోహితుడు కుడి నుంచి ఎడమ వైపునకు హనుమాన్ చాలీసాను ఐదు భాషల్లో సునాయాసంగా రాసి ఔరా అనిపించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి హనుమాన్ చాలీసాను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడం, ఒడియూ భాషల్లో రాసి పలువురి ప్రశంసలందుకున్నారు. తెలుగులో రాయడానికి 15 నిమిషాలు, హిందీలో 20 నిమిషాలు పట్టిందని, మొత్తం ఐదు భాషల్లో రాయడానికి 5 గంటలు పట్టిందని శ్రీహరి తెలిపారు. -
బెస్ట్ స్టడీస్.. బెటర్ ఫ్యూచర్.. ఐర్లాండ్
విదేశీ విద్య ఐర్లాండ్ ప్రత్యేకతలు: యూరో జోన్లో ఇంగ్లిష్ అధికార భాషగా గల ఏకైక దేశం ఐర్లాండ్. ఇదే కారణంతో ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో వేల సంఖ్యలో వివిధ బహుళజాతి సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటిల్లో దాదాపు 600 వరకు సాఫ్ట్వేర్ కంపెనీలున్నాయి. రిటెన్, స్పోకెన్ ఇంగ్లిష్‌లో పట్టున్న మన దేశ విద్యార్థులకు అనుకూలంగా ఉండటంతోపాటు కోర్సు పూర్తికాగానే ఉద్యోగావకాశాలు కూడా త్వరగానే లభిస్తున్నాయి. దీంతో మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులు ఐర్లాండ్‌ను ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు ఉన్న దేశాలకు, ప్రజలకు సురక్షితమైన జీవనాన్ని అందించే దేశాలకు, శాంతియుత దేశాలకు ఇలా వివిధ అంశాల్లో ప్రముఖ సంస్థలు ఇచ్చే ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ టాప్-5 దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఐర్లాండ్ వర్సిటీలు అందించే కోర్సులకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ఐర్లాండ్ వర్సిటీలు అందించే సర్టిఫికెట్స్‌కు గుర్తింపునిస్తున్నాయి. కోర్సులు పూర్తికాగానే ఏ దేశం వెళ్లైనా ఉన్నత విద్య చదువుకోవచ్చు. లేదంటే ఉద్యోగావకాశాలు పొందొచ్చు. ప్రస్తుతం 1500 మంది భారతీయ విద్యార్థులు అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ప్రవేశాలు సెప్టెంబర్‌లో ఐర్లాండ్ అంతర్జాతీయ విద్యార్థులకు ఏడాదిలో రెండుసార్లు ప్రవేశం కల్పిస్తోంది. ప్రధానంగా ప్రతి ఏటా సెప్టెంబర్‌లో దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. మరికొన్ని కోర్సులకు జనవరిలో కూడా ప్రవేశాలుంటాయి. కాబట్టి విద్యార్థులు మూడు, నాలుగు నెలల ముందుగానే దరఖాస్తుకు సిద్ధంగా ఉండాలి. దరఖాస్తుతోపాటు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ప్రస్తుత విద్యాభ్యాసం వరకు సంబంధిత సర్టిఫికెట్లను, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉన్నట్లు రుజువు చేసే ఐఈఎల్టీఎస్ స్కోర్ కార్డ్, అక్కడ విద్యాభ్యాసానికి అవసరమయ్యే ఖర్చులన్నింటినీ భరించగలిగే స్థోమత ఉన్నట్లు తెలిపే ఆస్తి డాక్యుమెంట్ల వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవేకాకుండా పాస్‌పోర్ట్‌ను, మీ లక్ష్యాలను క్లుప్తంగా వివరిస్తూ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ)ని విద్యార్థులు దరఖాస్తుతోపాటు సమర్పించాలి. వివిధ యూనివర్సిటీల వెబ్‌సైట్స్ ద్వారా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా కోసం మన దేశంలో ఉన్న ఐర్లాండ్ రాయబార కార్యాలయంలోనూ, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న వీసా ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనూ సంప్రదించాలి. వెళ్లడానికి కనీసం 8 వారాల ముందుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.5000 చెల్లించాలి. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఐర్లాండ్ వీసా అప్లికేషన్ సెంటర్ ఉంది. పాపులర్ కోర్సులు.. వ్యవధి: ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, లైఫ్ సెన్సైస్, కంప్యూటర్ సెన్సైస్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ వంటి కోర్సులకు ఐర్లాండ్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. మనదేశం నుంచి వెళ్తున్న విద్యార్థులు కూడా ఎక్కువగా ఇవే కోర్సులను ఎంచుకుంటున్నారు. కోర్సుల విషయానికొస్తే ఐర్లాండ్ యూనివర్సిటీలు సాధారణ డిగ్రీ కోర్సులు మొదలుకొని బ్యాచిలర్ డిగ్రీలో ఆనర్స్ కోర్సులు, మాస్టర్స్ కోర్సులు, డాక్టోరల్ కోర్సులు, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ కోర్సుల వ్యవధి ఏడాదికాగా, బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల వ్యవధి కోర్సును బట్టి మూడు నుంచి నాలుగేళ్లు ఉంటుంది. అదేవిధంగా డిప్లొమా కోర్సుల వ్యవధి ఏడాది. మనదేశంలో 10+2 పూర్తిచేసినవారు బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరొచ్చు. అయితే విద్యా సంస్థ, కోర్సును బట్టి 10+2లో 75 శాతం నుంచి 85 శాతం మార్కులు సాధిస్తే మంచి ఇన్స్టిట్యూట్లో కోరుకున్న కోర్సులో చేరే అవకాశముంటుంది. పీజీ కోర్సులకు కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు ఫీజులు అండర్గ్రాడ్యుయేట్ కోర్సు రుసుములు కోర్సును, ఇన్స్టిట్యూట్ను బట్టి వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా 9100 యూరోల నుంచి 37,000 యూరోల వరకు, పీజీ కోర్సు రుసుములు కూడా 9150 యూరోల నుంచి 37,000 యూరోల వరకు ఉంటాయి. నివాసం, భోజనం, బుక్స్, ఇతర ఖర్చుల కింద నెలకు మరో 1300 యూరోల వరకు అవుతాయి. పార్ట్‌టైం జాబ్స్.. శాశ్వత నివాసం.. ఐర్లాండ్‌లో విద్యనభ్యసించే అంతర్జాతీయ విద్యార్థులకు మరో సౌలభ్యం పార్ట్‌టైం జాబ్స్. విద్యార్థులు.. తమ కోర్సులు పూర్తయ్యేవరకు వారానికి 20 గంటలు పనిచేసుకోవడానికి అనుమతిస్తారు. సెలవు దినాల్లో అయితే వారానికి 40 గంటలు పార్ట్‌టైం జాబ్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా నిర్దేశిత గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తై తర్వాత కనీసం ఏడాదిపాటు ఉద్యోగం చేసుకోవడానికి వర్క్ పర్మిట్ పొందొచ్చు. ఈ సమయంలో ఏడాదికి కనీసం 30,000 యూరోలు పొందొచ్చు. ఆ తర్వాత మరో ఏడాదికి వీసా పొడిగింపు లభిస్తే ఐరిష్ ఎంప్లాయర్‌గా నమోదుచేసుకుని రెండేళ్ల కాలానికి గ్రీన్‌కార్డ్ లేదా ఎంప్లాయ్మెంట్ పర్మిట్ పొందొచ్చు. ఈ రెండేళ్లు కూడా పూర్తై పర్మినెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాలర్షిప్స్: విద్యనభ్యసించే విద్యార్థులకు ఐర్లాండ్ ప్రభుత్వం, యూనివర్సిటీలు, వివిధ సంస్థలు ఎన్నో స్కాలర్‌షిప్స్‌ను అందిస్తున్నాయి. వాటిలో కొన్ని.. ఐర్లాండ్ స్కాలర్షిప్ ఫర్ ఫారిన్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లిష్, గవర్నమెంట్ ఆఫ్ ఐర్లాండ్ స్కాలర్షిప్స్, ఐర్లాండ్ హోమ్ కమింగ్ స్టడీ ప్రోగ్రామ్ మొదలైనవి. ఇవే కాకుండా ది ఐరిష్ యూనివర్సిటీస్ అసోసియేషన్ కూడా భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తోంది. కొన్ని యూనివర్సిటీలు ట్యూషన్ ఫీజులో 50 శాతం తగ్గింపును కూడా ఇస్తున్నాయి. ఐర్లాండ్ గురించి క్లుప్తంగా.. రాజధాని: డబ్లిన్ అధికార భాషలు: ఐరిష్, ఇంగ్లిష్ కరెన్సీ: యూరో (ఒక యూరో భారత కరెన్సీలో దాదాపు 82 రూపాయలకు సమానం) జనాభా: 45,93,100 సమయం: ఐర్లాండ్ కాలమానం కంటే భారత కాలమానం దాదాపు ఐదు గంటల ముందుంటుంది. (ఐర్లాండ్‌లో ఉదయం తొమ్మిది అయితే ఇండియాలో మధ్యాహ్నం రెండు అవుతుంది)