తూర్పుగోదావరి: అందరూ ఎడమ నుంచి కుడి వైపుకు రాస్తారు. కానీ ఓ పురోహితుడు కుడి నుంచి ఎడమ వైపునకు హనుమాన్ చాలీసాను ఐదు భాషల్లో సునాయాసంగా రాసి ఔరా అనిపించారు.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి హనుమాన్ చాలీసాను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడం, ఒడియూ భాషల్లో రాసి పలువురి ప్రశంసలందుకున్నారు. తెలుగులో రాయడానికి 15 నిమిషాలు, హిందీలో 20 నిమిషాలు పట్టిందని, మొత్తం ఐదు భాషల్లో రాయడానికి 5 గంటలు పట్టిందని శ్రీహరి తెలిపారు.