ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా? Kangana Ranaut gifts a brand new house to newly-married cousin Varun in Chandigarh. Sakshi
Sakshi News home page

Kangana Ranaut: రీసెంట్‌గా పెళ్లి.. ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన కంగన

Published Tue, Jun 18 2024 9:52 AM | Last Updated on Tue, Jun 18 2024 11:07 AM

Kangana Ranaut Gifts New House To Her Cousin

స్టార్ హీరోయిన్, ఈ మధ్య ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్.. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. కజిన్ వరుణ్ రనౌత్ పెళ్లి రీసెంట్‪‌గా అతడికి చంఢీగడ్‌లో ఖరీదైన లగ్జరీ ఇంటిని బహుమతిగా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇన్ స్టా స్టోరీలో మొత్తం అవే ఫొటోలని పోస్ట్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: హీరో దర్శన్ కేసులో మరో కన్నడ హీరోకి నోటీసులు)

హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన కంగనా రనౌత్.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎన్నో ఇబ్బందులు దాటుకుని హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ప్రభాస్‌తో 'ఏక్ నిరంజన్' సినిమా చేసింది. గత కొన్నాళ్ల నుంచి ఓవైపు నటిస్తున్నప్పటికీ మరోవైప రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటూ వచ్చింది. అలా ఈ మధ్య లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయిపోయింది.

అలా ఎంపీగా అయిన ఆనందంలో ఉన్న కంగనా రనౌత్.. రీసెంట్‌గా తమ్ముడు వరసయ్యే వరుణ్ పెళ్లికి హాజరైంది. అందరిలా కాకుండా ఏకంగా ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చి అతడిని సర్‌ప్రైజ్ చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం 'ఎమర్జెన్సీ' సినిమాలో కంగన నటిస్తోంది. ఒకప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కంగన నటిస్తోంది. ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement