ఢిల్లీ:చంద్రయాన్ 3 విజయంపై ఇస్రో చీఫ్ సోమనాథ్ పట్ల ప్రశంసల వెల్లువ కురుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సోమనాథ్‌కు ఓ చిన్నారి నుంచి అరుదైన బహుమతి అందింది. జాబిల్లిపై వాలిన విక్రమ్ ల్యాండర్ నమూనాను చేతితో తయారు చేసిన పిల్లాడు.. దానిని ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు బహుకరించాడు. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్త పీవీ వెంకటకృష్ణన్ తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు.
ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. చంద్రయాన్ 3 విజయంతో దేశంలో వచ్చే తరాలకు ఎంతో ప్రోత్సాహం అందించారని సోమనాథ్‌ను కొనియాడారు. ఆ బాలున‍్ని ఆసక్తిని మెచ్చుకున్నారు. భవిష్యత్‌లో ఎందరో పిల్లలు శాస్త్రవేత్తగా ఎదగాలనుకుంటారు. బాలునికి శుభాకాంక్షలు అని తెలిపారు.
ISRO Chief Sri Somanath today had a surprise visitor,A young neighbour boy has handed over own made Vikram Lander model to the ISRO chief on behalf of all the neighbours. pic.twitter.com/BcyHYO0pDW
— Dr. P V Venkitakrishnan (@DrPVVenkitakri1) September 2, 2023
చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా ఆగష్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్రోకు ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇస్రో చీఫ్ సోమనాథ్ విమానంలోకి ఎక్కగానే.. ఫ‍్లైట్‌లో ప్రయాణికులందరూ ఆయన్ని అభినందించిన విషయం తెలిసిందే.
చంద్రయాన్ 3తో పాటు సెప‍్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్1ను కూడా ప్రయోగించింది. సూర్యూనిపై పరిశోధనలు జరపడానికి ఈ మిషన్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. 125 రోజుల పాటు ప్రయాణం చేసి సూర్యుని గుట్టు విప్పే పనిలో ఆదిత్య ఎల్ 1 నిమగ్నమవనుంది.
ఇదీ చదవండి: Chandrayaan-3: స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్..
Comments
Please login to add a commentAdd a comment