అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం ఈ రోజు (జులై 12) జరగనుంది. అంబానీ ఇంట జరుగుతున్న ఈ పెళ్ళి సందర్భంగా రిలయన్స్ ఉద్యోగులకు గిఫ్ట్ బాక్స్ పంపించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. రెడ్ కలర్ బాక్స్, దాని మీద దేవీ, దేవతల దివ్య దయతో 12 జులై 2024న ఆనంద్ మరియు రాధికల వివాహాన్ని జరుపుకుంటున్నాము. నీతా, ముఖేష్ అంబానీల శుభాకాంక్షలు అని ఉండటం చూడవచ్చు.
అంబానీ ఫ్యామిలీ పంపించిన గిఫ్ట్ బాక్స్‌లో హల్దీరామ్ ఆలూ భుజియా సేవ్, లైట్ చివాడాతో సహా పలు రకాల స్వీట్లు ఉన్నాయి. వీటితో పాటు ఓ వెండి కాయిన్ కూడా ఉంది. ఈ గిఫ్ట్ అందుకున్న ఉద్యోగులు అనంత్ & రాధిక జంటను అభినందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ చేస్తున్నారు.
అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహ వేడుకలు సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాలతో జరిగే అవకాశం ఉంది. ప్రధాన వేడుకలు శుక్రవారం, జూలై 12 వివాహ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. ఆ తరువాత జూలై 13, శనివారం శుభ్ ఆశీర్వాద్‌తో వేడుకలు.. జులై 14 ఆదివారం మంగళ్ ఉత్సవ్ లేదా వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వివాహ వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment