
ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్. అతను పలు భాంగ్రా, పాప్, సినీ గీతాలు ఆలపించి ఫేమస్ అయ్యారు. సుప్రసిద్ధ పంజాబీ సింగర్ దలేర్ మెహంది తమ్ముడు మికా సింగ్. అతని తల్లిదండ్రులిద్దరూ సంగీతాభిమానులు కావడం వల్ల మికా కూడా ఆ రంగం పట్ల ఆకర్షితుడయ్యాడు. తెలుగులో మిర్చి సినిమాలో తన వాయిస్ వినిపించాడు. తాజాగా మికా సింగ్ తన స్నేహితునికి ఓ ఖరీదైన బహుమతి ఇచ్చాడు. తన అత్యంత సన్నిహితుడైన కన్వల్ జీత్ సింగ్‌కు మెర్సిడెజ్ బెంజ్ కారును బహుకరించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు మికా సింగ్. స్నేహితుని కారును ఇచ్చిన అతని కలను నెరవేర్చాడు సింగర్ మికా.
మికా తన ఇన్‌స్టాలో ఫోటో షేర్ చేస్తూ.. ' మేం ఎప్పుడు ఏదో ఒకటి కొనుగోలు చేస్తుంటాం. కానీ మీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తుల గురించి ఆలోచించరు. కానీ నా స్నేహితుడు ఈ ఆనందానికి అర్హుడు. అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆయన అభిమానులు మికా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీది చాలా పెద్దమనసు ఉంటూ ప్రశంసిస్తున్నారు. సింగర్ మికా ప్రేమకు కన్వల్ జీత్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు.
కన్వల్ దీత్ సింగ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'మేము కలిసి 30 ఏళ్లు అయింది. అతను కేవలం నా స్నేహితుడు మాత్రమే కాదు. అంతకు మించి మేము జీవితాంతం సోదరులం. నా ఫేవరేట్ కారును బహుమతిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతంగా ఉంది. మీది చాలా గొప్పమనసు. ఈ బహుమతిని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను.' అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment