Producer Costly Gifts To Simbu And Director Gautham Menon - Sakshi
Sakshi News home page

Simbu : హీరో శింబుకు ఖరీదైన కారు గిఫ్ట్‌ ఇచ్చిన నిర్మాత

Published Sun, Sep 25 2022 1:39 PM | Last Updated on Mon, Sep 26 2022 5:01 PM

Producer Costly Gifts To Simbu And Director Gautham Menon - Sakshi

'మానాడు' విజయంతో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చిన హీరో శింబు. తాజాగా ఆయన నటించిన ‘వెందు తానింధాతు కాడు’సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులోకి ‘ది లైఫ్‌ ఆఫ్ ముత్తు’పేరుతో విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ టేకింగ్ సినిమాకు మరింత ప్లస్‌ అయ్యింది. చిన్న ఊరు నుంచి వచ్చిన ముత్తు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అన్న నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం​ థియేటర్లలో దూసుకుపోతుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత ఇషారి.కే గణేష్.. హీరో శింబు, గౌతమ్‌ మీనన్‌లకు కాస్ట్‌లీ గిఫ్టులు ఇచ్చారు. హీరో శింబుకు టొయోటొ న్యూ వెల్‌వైర్‌ కారును గిఫ్టుగా ఇవ్వగా, డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌కు ఖరీదైన బైక్‌ను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement