Woman Receives Tomatoes Precious Gift On Her Birthday Maharashtra - Sakshi
Sakshi News home page

ప్రస్తుతం ట్రెండ్‌ ఇదే! పుట్టినరోజు ఊహించని బహుమతి.. ఉబ్బితబ్బిబ్బైన మహిళ

Published Wed, Jul 12 2023 4:50 PM | Last Updated on Wed, Jul 12 2023 5:13 PM

Woman Receives Tomatoes Precious Gift On Her Birthday Maharashtra - Sakshi

ముంబై: ప్రస్తుతం దేశంలో టమాటా ట్రెండింగ్‌లో ఉంది. గతంలో అర్థసంచరీ కూడా లేని టమాట.. తాజా పరిస్థితుల నేపథ్యంలో సెంచరీ దాటేసి త్వరలోనే డబుల్‌ సంచరీ టచ్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే గృహిణులు ఆచితూచి టమాటాలను వినియోగిస్తున్నారు. అంతేనా టమాటాలు విలువైన వస్తువుల జాబితాలోకి వెళ్లిపోయాయి. ఎంతలా అంటే పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలకు విలువైన వస్తువుగా టామాటాలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు.

తాజాగా మహారాష్ట్రలో ఓ మహిళ పుట్టిన రోజు వేడుకలకు టమాటాలను బహుమతిగా ఇవ్వడం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని కళ్యాణ్‌లోని కొచ్చాడి ప్రాంతానికి చెందిన సోనాల్ బోర్స్ అనే మహిళ ఇటీవల తన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ వేడుకలో ఆమె ఊహించని బహుమతిని అందుకుంది. ఆమె బంధువుల గిఫ్ట్‌గా 4 కిలోల టమాటాలను ఓ బుట్టలో తీసుకొచ్చి ఇచ్చారు. ఈ టమాటాలను చుట్టూ పెట్టుకుని సోనాల్ కేక్‌ కట్‌ చేసింది. తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టమాటాలను బహుమతిగా అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇంతకంటే మంచి బహుమతి ఇంకేం ఉంటుందని సోనాల్ ఆనందం వ్యక్తం చేసింది.

చదవండి: నిరుద్యోగ కార్మికుడికి రూ.24. 61 లక్షల పన్ను కట్టమంటూ నోటీసులు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement