మిస్టర్ బీస్ట్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా? | YouTuber MrBeast giving away 26 cars on his birthday; Check details here | Sakshi

మిస్టర్ బీస్ట్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?

May 8 2024 3:54 PM | Updated on May 8 2024 4:28 PM

YouTuber MrBeast giving away 26 cars on his birthday; Check details here

ఖరీదైన టెస్లా కావాలా నాయనా?  అంటూ ఊరిస్తున్న మిస్టర్‌ బీస్ట్‌

26వ పుట్టినరోజు సందర్బంగా 26 టెస్లా కార్లు 

కండీషన్స్‌ అప్లయ్‌, ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

అమెరికన్ యూట్యూబర్, ప్ర‌ముఖ  సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్  తన ఫాలోయర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాడు. మిస్టర్ బీస్ట్‌గా  పాపులర్‌ అయిన జిమ్మీ డొనాల్డ్‌సన్ తన 26వ పుట్టినరోజు (మే 7) సందర్భంగా 26 టెస్లా కార్లను బహుమతిగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ఇందులో ఒక సైబ‌ర్ ట్ర‌క్ కూడా ఉంద‌ని ప్రకటించడం విశేషం.  కండిషన్స్‌ అప్లయ్‌ అంటూ కొన్ని నిబంధనలు కూడా  పెట్టాడు. దీంతో ఈ వీడియో  నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

వైరల్ కంటెంట్ విచిత్రమైన సవాళ్లతో తనకు తానే సాటి  అని నిరూపించుకనే మిస్ట‌ర్ బీస్ట్ తాజాగా దీనికి సంబంధించిన వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఇందులో ఒక మతలబు ఉంది. తన పోస్ట్ కింద కామెంట్ చేసి, ఇద్దరు ఫ్రెండ్స్‌ను ట్యాగ్‌ చేసిన 26 మందిని  ఎంపిక చేసి, 26 కార్ల‌ను బ‌హుమ‌తిగా ఇస్తానని ప్రకటించాడు. డ్రా తీసిన అనంతరం విజేతలకు డైరెక్ట్‌గా మెసేజ్‌ చేస్తానని, వారం రోజుల్లో (మే 11న) ఎంపికైన వారి వివరాలను ప్రకటిస్తానని తెలిపాడు. అంతేకాదు రకరకాల పేర్లు, లేదా రీపోస్ట్‌లు లాంటి జిమ్మిక్కులు పనిచేయవని  కూడా వెల్లడించాడు.

 

254 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లతో యూట్యూబ్‌లో అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా కొన‌సాగుతున్న మిస్టర్ బీస్ట్ నికర విలువ రూ.4,175 కోట్లు (500 మిలియన్ల డాలర్లు)గా తెలుస్తోంది.  2012 ప్రారంభంలో 13 ఏళ్ల‌ వయస్సులో 6000 పేరిట తొలుత ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. ఆ త‌ర్వాత బీస్ట్ రియాక్ట్స్, మిస్టర్ బీస్ట్ గేమింగ్, మిస్టర్ బీస్ట్ 2, అలాగే ఒక దాతృత్వ ఛానెల్ బీస్ట్ ఫిలాంత్రరోపీని నడుపుతున్నాడు. దీని ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను  విరాళాలిస్తుంటాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement