ఈ ఏడాది మెగా ఇంట్లో పెద్ద పండగే జరిగింది. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత మెగా వారసురాలు అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. జూన్ నెలలో రామ్ చరణ్ భార్య ఉపాసనకు బేబీ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ తన మనవరాలి పేరును ప్రకటించారు. గతనెలలో నామకరణం ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు.
(ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?)
అయితే మెగా వారసురాలికి వచ్చిన గిఫ్ట్‌లపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బిడ్డకు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ పంపినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలను మెగా ఫ్యామిలీ కొట్టిపారేసింది. అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన మెగా వారసురాలికి మెగాస్టార్ ఏ గిఫ్ట్ ఇచ్చారనే విషయంపై ఎక్కడా కూడా చర్చ జరగలేదు. కానీ తన మనవరాలికి చిరంజీవి దంపతులు ఓ చిరు కానుక ఇచ్చినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ దంపతులు తమ మనవరాలు క్లీంకారకు ఆంజనేయస్వామి రూపంతో ఉన్న బంగారు డాలర్స్‌ను అందమైన డిజైన్‌తో తయారు చేయించి ఇచ్చినట్లు ఉపాసన వెల్లడించింది. మెగా ఫ్యామిలీ హనుమాన్ భక్తులు అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి ఆంజనేయస్వామిని ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే తన మనవరాలికి ఇష్టదైవాన్నే ప్రతిరూపంగా బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే ఉపాసన తల్లిదండ్రులు బంగారు ఉయలను గిఫ్ట్‌గా ఇచ్చినట్లుగా తెలుస్తోంది..!!
కాగా.. ప్రస్తుతం మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెల ఇక కుమార్తెతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్న ఈమె.. తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
(ఇది చదవండి: అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!)
ప్రెగ్నెన్సీ జర్నీపై ఉపాసన మాట్లాడుతూ.. 'ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారితే వాళ్ల సంతోషానికి అవధులుండవు. అలాంటి మధుర క్షణాలు.. పిల్లల పేరెంట్స్ కు అందిస్తున్న డాక్టర్స్ కు నా తరఫున ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది నాకు సలహాలు ఇచ్చేవారు' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment