
సాక్షి, ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలులో మూడో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ నిధులను విడుదల చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కొడుకు ప్రణీత్ రెడ్డి సీఎం జగన్‌కు దూసుకెళ్తున్న బుల్(ప్రభుత్వం అభివృద్దిలో దూసుకుపోతోంది అన్నట్టుగా)ను బహుమతిగా అందజేశారు. ఈ బహుమతికి సీఎం జగన్ ఫిదా అయ్యారు.
కాగా, అంతకుముందు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మహిళల పక్షపాతి.. అన్నింటా మహిళలే ప్రధానం అని భావిస్తారు. మేనిఫెస్ట్‌లో ఇచ్చిన వాగ్ధానాలను 90 శాతం వరకు సీఎం జగన్ నెరవేర్చారు. సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు.
ఇది చదవండి: దుష్టచతుష్టయం కడుపు మంటతో ఉంది: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment