వాట్సాప్‌లో గ్రూపులను టార్గెట్‌ చేసే బగ్‌ | WhatsApp Found Bug To Crash App And Delete Group Chats | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో గ్రూపులను టార్గెట్‌ చేసే బగ్‌

Published Wed, Dec 18 2019 2:26 AM | Last Updated on Wed, Dec 18 2019 3:42 AM

WhatsApp Found Bug To Crash App And Delete Group Chats - Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్‌లోని వాట్సాప్‌ గ్రూపులను టార్గెట్‌ చేసే బగ్‌ను తాము గుర్తించినట్లు వాట్సాప్‌ వెల్లడించింది. దీని బారిన పడకుండా ఉండేందుకు తాజా వెర్షన్‌ 2.19.58కు అప్‌డేట్‌ చేసుకోవాలని మంగళవారం సూచించింది. బగ్‌ కారణంగా గ్రూపుల్లోని మెసేజులు శాశ్వతంగా డిలీట్‌ అవుతున్నాయని తెలిపారు. హ్యాకర్లు వాట్సాప్‌ వెబ్‌ను ఉపయోగించి వెబ్‌ డీబగ్గింగ్‌ టూల్‌ ద్వారా గ్రూపుల్లో ప్రత్యేక పారామీటర్లు ఉన్న సందేశాలు పంపుతున్నారని తెలిపారు. దీనివల్ల గ్రూప్‌ క్రాష్‌ అయ్యి పనిచేయడం ఆగిపోతోందని వాట్సాప్‌ ప్రొడక్ట్‌ వల్నెరబిలిటీ రీసెర్చ్‌ చెక్‌ పాయింట్స్‌ హెడ్‌  ఓడెడ్‌ వనును తెలిపారు. అయితే ఈ హ్యాకింగ్‌ ప్రక్రియను సాగించే హ్యాకర్లు ఆయా గ్రూపుల్లో సభ్యులై ఉంటారని చెప్పారు. ఈ బగ్‌కు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో వినియోగదారులు వాట్సాప్‌ అన్‌ఇన్‌స్టాల్‌ చేసి మళ్లీ ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి వస్తోందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement