ఊహించని పరిణామం అంటే ఇదే.. | Watch Viral Video About Spider Drags Bug Into Underground | Sakshi
Sakshi News home page

ఊహించని పరిణామం అంటే ఇదే..

Published Sat, Mar 7 2020 5:04 PM | Last Updated on Sat, Mar 7 2020 8:42 PM

Watch Viral Video About Spider Drags Bug Into Underground - Sakshi

ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అనడానికి ఉదాహరణగా ఈ సన్నివేశాన్ని చెప్పుకోవచ్చు. ఒక బగ్‌ను సాలీడు అమాంతం లాగేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక బగ్‌ ఆహారం వెతుక్కుంటూ తన దారిన తాను పోతుంది. దాని పక్కన ఒ​క పెద్ద మట్టికుప్పలాగా ఉంది. ఆ మట్టికుప్ప కింద సాలీడు తన స్థావరాన్ని ఏర్పరుచుకొంది. అయితే బగ్‌ దానిని చూసి పట్టించుకోకుండానే ముందుకు వెళ్లిపోయింది. అయితే బగ్‌ తన చావు ఆ మట్టికుప్పలోనే పొంచి ఉందని అస్సలు ఊహించి ఉండదు. బగ్‌ అలా కొంచెం ముందుకు వెళ్లగానే.. కుప్పలో నుంచి సాలీడు బయటికి వచ్చి తన ఎనిమిది కాళ్లతో అమాంతం దానిని కిందకు లాక్కొంది. ఈ ఘటన జరిగి చాలా రోజులైంది. తాజాగా ఈ వీడియోనూ ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ సుషాంత నందా తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ' జీవితంలో ఎవరైనా ఇలాంటి ఆశ్చర్చకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే. చావు నుంచి ఎవరు అతీతులు కారు' అంటూ  కాప్షన్‌ జత చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోనూ 4500 మందికి పైగా వీక్షించారు. 'పాపం.. బగ్‌'.. 'వీడియో చూడగానే భయమేసింది'.. 'ఓ మై గాడ్‌'.. 'తెలివైన స్పెడర్‌' అంటూ కామెంట్లు పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement