న్యూయార్క్: అమెరికా గగనతలంలో ప్రతి రోజు విమానాల ట్రాఫిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ ట్రాఫిక్ ఒక్కసారిగా తగ్గిపోతే ఎలాఉంటుందో శుక్రవారం(జులై 19) అర్థమైంది.
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో బగ్ సమస్య తలెత్తి అమెరికాలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీలైన అమెరికన్ ఎయిర్‌లైన్స్,డెల్టా,యునైటెడ్ సంస్థల విమానాలు ఎక్కడికక్కడే ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోయాయి.
దీంతో అగ్రదేశ గగనతలంలో విమానాల ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ సాధారణ సమయంలో విమానాల రద్దీ ఎలా ఉంటుంది.. శుక్రవారం విమానాల రద్దీ తగ్గిన తర్వాత ఎలా ఉందనే 12 గంటల ఆసక్తికర టైమ్‌లాప్స్ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విమానాల ట్రాఫిక్ టైమ్‌లాప్స్ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు.
12-hour timelapse of American Airlines, Delta, and United plane traffic after what was likely the biggest IT outage in history forced a nationwide ground stop of the three airlines. pic.twitter.com/wwcQeiEtVe
— Colin McCarthy (@US_Stormwatch) July 19, 2024
Comments
Please login to add a commentAdd a comment