అంతరిక్ష కేంద్రంలో ‘స్పేస్‌ బగ్‌’ .. ఇబ్బందుల్లో సునీతా విలియమ్స్‌! | Space Bug Detected At Space Station, Trouble For Astronaut Sunita Williams Crew | Sakshi
Sakshi News home page

Spacebug Found In ISS: అంతరిక్ష కేంద్రంలో ‘స్పేస్‌ బగ్‌’ .. ఇబ్బందుల్లో సునీతా విలియమ్స్‌!

Published Tue, Jun 11 2024 12:34 PM | Last Updated on Tue, Jun 11 2024 1:10 PM

Spacebug Detected At Space Station:Trouble For Sunita Williams Crew

భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌(59) మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్‌లైన‌ర్‌ అంత‌రిక్ష నౌక ద్వారా మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌తో సురక్షింతగా అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌)కు చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా విలియమ్స్‌తో సహా 8 మంది సిబ్బందికి ‘స్పేస్‌ బగ్‌’ రూపంలో ఇబ్బంది వచ్చిపడింది.  

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్‌గా పిలిచే ‘ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే బాక్టీరియా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్ష వాతావరణంలో ఈ బ్యాక్టీరియా మరింత బలం పెంచుకుంటోందని తెలిపారు. ఇది అనేక ఔషదాలను నిరోధించగలిగే శక్తివంతమైనదని వివరించారు. ఈ బ్యాక్టీరియా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ కావడం వల్ల దీన్ని ‘సూపర్ బగ్’గా పిలుస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. 

అయితే ఇది శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఈ స్పేస్‌ బగ్‌తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునితా విలియమ్స్ సహా మిగిలిన ఎనిమిది మంది సిబ్బంది ఇబ్బందుల్లో పడనున్నట్లు తెలుస్తోంది. 

సాధారణంగా అంతరిక్ష కేంద్రం.. కదిలే అంతరిక్ష శిధిలాల వల్ల ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ఒకరి నుంచి మరోకరి వ్యాపించే ‘స్పేస్‌ బగ్‌’ గత కొన్ని ఏళ్ల నుంచి అభివృద్ధి చెందటం మరింత ఆందోళన కలిగిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొటుంన్నారు.  

వ్యోమగాములు అంతరిక్ష యాత్రల సమయంలో ఆరోగ్యపరంగా సవాళ్లను ఎదుర్కొంటారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రోనాట్స్‌ ఆరోగ్యం కోసం ‘స్పేస్‌ బగ్‌’ ప్రభావాన్ని, ప్రతికూలతలను అంతరిక్ష కేంద్రం త్వరగా అంచనా వేయటం కీలమని పేర్కొంటున్నారు.

సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రోనాట్‌ బారీ యూజీన్ బుచ్‌ విల్మోర్‌ జూన్ 6, 2024 న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సునిత డ్యాన్స్ చేసి తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే వారు వారం రోజులు పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి.. అనంతరం భూమిపైకి తిరిగి వస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement