
ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్ ఎప్పడికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ యూజర్లను అలరిస్తూ ఉంది. ఈ కొత్త ఫీచర్లను అప్‌డేట్ చేసే క్రమంలోనే ఈ చాట్ యాప్‌లో బగ్స్‌ను కూడా యూజర్లు పొందుతున్నారు. ఇదే మాదిరి వాట్సాప్ బీటా యూజర్లకు బుధవారం రాత్రి నుంచి ఓ ఫన్నీ బగ్స్ తమ చాట్ యాప్‌లో కనిపిస్తూ యూజర్లను తికమకపెడుతున్నాయి. అదేమిటంటే.. చాట్ యాప్‌లో వచ్చే ‘today’ , ‘yesterday’ బదులు ‘ 84oday’, ‘ 89esteday’ లు కనిపిస్తున్నాయి. ఈ బగ్ విషయాన్ని వాట్సాప్ అభిమానుల సైట్ డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్టు చేసింది. ఈ బగ్స్ కేవలం వాట్సాప్ వెర్షన్ 2.18.109 బీటా యూజర్లకు మాత్రమే కనిపిస్తున్నాయని పేర్కొంది.
ఇటీవల వాట్సాప్ రోజుకో కొత్త ఫీచర్‌తో యూజర్లను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌కు మెసేజ్‌ను లాక్ చేసుకునే ఫీచర్‌ను తీసుకొచ్చింది. అంతేకాక కేవలం ఈ మాధ్యమాన్ని చాట్ యాప్‌గా మాత్రమే కాక, అంతకంటే మించి దీన్ని సేవలను విస్తరించాలని కంపెనీ చూస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ పేమెంట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నమోదు చేయాల్సినవసరం లేకుండా ఒక అకౌంట్ నుంచి నుంచి మరో అకౌంట్‌కు డబ్బులు పంపించుకోవడానికి ఈ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు సహకరిస్తోంది. యూపీఐను ఆధారితంగా ఈ పేమెంట్ ఫీచర్‌ను ఆఫర్ చేస్తోంది. ఒకవేళ ఆ ఫీచర్ మీ యాప్‌లో కనిపించకపోతే, ఆ ఫీచర్ ఉన్న స్నేహితుల నుంచి డబ్బులు పంపించమని అడిగి, ఆ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకునే సౌకర్యాన్ని పొందవచ్చు.
89ESTERDAY AND 84ODAY: new bugs in WhatsApp beta for Android 2.18.109. pic.twitter.com/UsxSZV6tCX
— WABetaInfo (@WABetaInfo) April 12, 2018
Comments
Please login to add a commentAdd a comment