ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌లో బగ్‌ను కనిపెట్టిన కేరళ విద్యార్థి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రశంసలను, గౌరవాన్ని దక్కించుకున్నాడు. తద్వారా కేరళలోని పత్తంతిట్ట జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి కేఎస్ అనంత కృష్ణన్ (19) హీరోగా నిలిచాడు. ఈ మేరకు కేరళకు చెందిన మాతృభూమి ఒక కథనాన్ని ప్రచురించింది.
వాట్సాప్లో యూజర్లకు తెలియకుండానే ఆయా ఫైళ్లను, సమాచారాన్ని ఇతరులు పూర్తిగా తొలగించే బగ్ను అనంత కృష్ణన్ గుర్తించాడు. దీని గురించి ఫేస్‌బుక్‌కి సమాచారం అందించారు. అంతేకాదు ఈ బగ్ పరిష్కార మార్గాన్ని కూడా వివరించాడట. అయితే దీనిపై రెండు నెలలపాటు నిశితంగా అధ్యయనం చేసిన ఫేస్‌బుక్ అనంతకృష్ణన్ నైపుణ్యాన్ని చూసి అబ్బురపడింది. దీంతో అతడ్ని సత్కరించాలని నిర్ణయించింది. 34 వేల రూపాయల ( 500 డాలర్లు) నగదు బహుమతితో బాటు ప్రతిష్టాత్మక ‘ హాల్ ఆఫ్ ఫేమ్ ‘లో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఏడాది ఫేస్ బుక్ థ్యాంక్స్ లిస్టులోని 80 వ స్పాట్ లో అనంతకృష్ణన్ పేరు చోటు చేసుకుంది. దీనికి అనంతకృష్ణన్ కూడా ఫేస్‌బుకి కృతజ్ఞతలు తెలిపాడు. మౌంట్ జియోన్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ చదువుతున్నప్పటినుంచీ ఎథికల్ హ్యాకింగ్‌పై పరిశోధన చేస్తున్నాడు. ప్రస్తుతం కేరళ పోలీసు విభాగం సైబర్ సెల్లో సేవలందిస్తున్నాడు అనంత కృష్ణన్.
Comments
Please login to add a commentAdd a comment