జ్యూరిచ్: ఆపిల్ ఐఫోన్ మళ్లీ పేలింది. తాజా నివేదికల ప్రకారం స్విట్జర్‌లాండ్‌లోని ఒక షాపులో ఐఫోన్ బ్యాటరీ పేలుడు సంభవించింది. మరమ్మత్తు చేస్తుండగా ఐఫోన్ బ్యాటరీ పేలడంతో ఒకవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పేలిన ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ను ఐఫోన్ 6 గా గుర్తించినట్టు సమాచారం.
www.swissinfo.ch అందించిన ఒక నివేదిక ప్రకారం మంగళవారం ఈ పేలుడు చోటు చేసుకుంది. జ్యూరిచ్ లోని ఒక ఆపిల్ దుకాణంలో ఐఫోన్ రిపేరు చేస్తుండగా అకస్మాత్తుగా బ్యాటరీ పేలుడు జరిగింది. దీంతో రిపేరు చేస్తున్న వ్యక్తి గాయపడగా, మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ పేలుడుకు కారణాలు ఇంకా తెలియలేదని ఆ నివేదిక పేర్కొంది. ఈ సంఘటనపై జ్యూరిచ్ ఫోరెన్సిక్ ఇన్స్టిట్యూట్ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే స్టోర్ సిబ్బంది తక్షణమే అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఒక ప్రకటనలో తెలిపారు మరోవైపు ఈ పేలుడుపై ఆపిల్ ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment