battery explosion
-
Secunderabad Fire Tragedy: బ్యాటరీ పేలుడు వల్లే..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదానికి ఈ–స్కూటర్ బ్యాటరీ పేలడమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదం కారణంగా వెలువడిన దట్టమైన పొగ ప్రభావంతోనే లాడ్జీలో బస చేసిన వాళ్లు చనిపోయినట్లు తేల్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో క్షతగాత్రుడు మంగళవారం మృతిచెందాడు. దీంతో ఈ దుర్ఘటనలో కన్నుమూసిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన హోటల్, విద్యుత్ ద్విచక్ర వాహనాల షోరూమ్ నిర్వహిస్తున్న రాజేందర్‌సింగ్ బగ్గా, సుమిత్ సింగ్లతోపాటు మరికొందరిపై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సెల్లార్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు.. హైదరాబాద్‌లోని కార్ఖానా ప్రాంతానికి చెందిన రాజేంద్రసింగ్ బగ్గా, సుమీత్‌సింగ్ కొన్నేళ్లుగా సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ రోడ్డులో రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్ పేరుతో లాడ్జి నిర్వహిస్తున్నారు. అలాగే రెండేళ్ల క్రితం ఈ–స్కూటర్స్, బైక్స్ వ్యాపారంలోకి దిగారు. ఓ సంస్థకు చెందిన ఈ–స్కూటర్స్ డీలర్షిప్ తీసుకొని షోరూం, సర్వీసింగ్ సెంటర్లను లాడ్జి గ్రౌండ్‌ఫ్లోర్, సెల్లార్లో అక్రమంగా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్, ఈ–స్కూటర్స్ కార్యాలయం, మొదటి అంతస్తు నుంచి నాలుగో అంతస్తు వరకు మొత్తం 28 గదులు ఉన్నాయి. ఐదో అంతస్తులోని పెంట్ హౌస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలడంతో... సోమవారం రాత్రి 9:17 గంటలకు సెల్లార్‌లోని ఈ–స్కూటర్స్ సర్వీసింగ్ పాయింట్లో చార్జింగ్ పెట్టి ఉంచిన ఈ–స్కూటర్ బ్యాటరీ పేలడంతో మంటలు అంటుకున్నాయి. ఇవి మిగతా వాహనాలకు, నిల్వఉంచిన టైర్లు, ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులకు అంటుకోవడంతో మంటలతోపాటు దట్టమైన పొగ, విషవాయువులు వె లువడ్డాయి. ఆ సమయంలో లాడ్జీలో 25 మంది అతిథులు, 8 మంది ఉద్యోగులు ఉన్నారు. మెట్లమార్గం సెల్లార్ వరకు ఉండటంతో... ఈ భవనాన్ని సరైన వెంటిలేషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడం, ఐదో అంతస్తు నుంచి సెల్లార్ వరకు నిర్మించిన మెట్ల మార్గం మీటర్ కంటే తక్కువ వెడల్పుతో ఇరుకుగా ఉండటంతో ప్రమాద సమయంలో అదే చిమ్నీ గొట్టంలాగా మారిపోయింది. సెల్లార్ నుంచి విషవాయువులు, నల్లటి పొగ దీని ద్వారానే లాడ్జి మొత్తం వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్లో స్టెయిర్ కేస్‌కు, రిసెప్షన్‌కు మధ్య తలుపు మూసి ఉండటంతో పొగ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. పొగను గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీయగా మొదటి, రెండో అంతస్తుల్లో బస చేసిన వారిలో నలుగురు గదుల్లోనే, మరో ముగ్గురు మెట్ల మార్గంలో ప్రాణాలు విడిచారు. మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. మూడు, నాలుగో అంతస్తుల్లో బస చేసిన కొందరిని స్థానికులు, పోలీసులు.. అగ్నిమాపక అధికారులు కాపాడారు. పెంట్‌హౌస్‌లోని రెస్టారెంట్లో భోజనం చేస్తున్న నలుగురు పక్క భవనం టెర్రస్‌పైకి చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. భవనానికి స్ప్రింక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినా సెల్లార్లో అది పనిచేసిన ఆనవాళ్లు కనిపించలేదు. విషవాయువులు పీల్చడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వివరించారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల నష్టపరిహారం ప్రకటించారని హోం మంత్రి తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత దట్టమైన పొగ వ్యాపించడంతో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఘటనపై పోలీస్, అగ్నిమాపక శాఖలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయని, అన్ని కోణాలలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించామని హోం మంత్రి వెల్లడించారు. కేంద్రం రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రధాని కార్యాలయం మంగళవారం ట్వీట్ చేసింది. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) -
బీడీల కంపెనీ ఎదుట నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ స్కూటీ ఒక్కసారిగా...
దుబ్బాక: లంగర్ బీడీ కంపెనీ ఎదుట పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీలో పేలుడు సంభవించి మంటల్లో కాలిపోయింది. ఈ ఘటన దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 10వ వార్డులో మంగళవారం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన దోర్నాల హరిబాబు బీడీ కంపెనీ టేకేదార్‌గా పని చేస్తున్నాడు. ఏడాది కిందట పట్టణంలోని ఓ వాహన షోరూం నుంచి ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేశాడు. ప్రతీరోజు బీడీల గంపను స్కూటీపై పెట్టుకొని రామక్కపేట నుంచి లచ్చపేట లంగర్ బీడీ కంపెనీకి తీసుకెళ్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం స్కూటీని కంపెనీ ఎదుట నిలిపి ఉంచగా, స్కూటీ బ్యాటరీ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కూటీ పూర్తిగా దగ్ధమ వడంతోపాటు పక్కనే నిలిపి ఉన్న సైకిల్ పాక్షికంగా కాలిపోయింది. స్థానికులు అప్రమత్తమై నీళ్లు చల్లి మంటలను అదుపు చేయడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎలక్ట్రిక్ కంపెనీ ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. -
ఈ-బైక్ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి దుర్మరణం
-
Nizamabad: పేలిన ఈ-బైక్ బ్యాటరీ.. ఒకరి మృతి
సాక్షి, నిజామాబాద్: పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. నిజామాబాద్ టౌన్ సుభాష్ నగర్ లో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ చార్జింగ్ పెట్టి పడుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వాళ్లకు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నోకియా ఫోను పేలి యువతి మృతి
జర్సుగుడ : ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడితే, మొబైల్స్ పేలిపోతున్న ఘటనలు ఇటీవల తరచు వింటూనే ఉన్నాం. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టే ఫోన్ మాట్లాడుతూ.. తీవ్ర ప్రమాద బారిన పడుతున్నారు. ఇదే మాదిరి ఒడిశాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఒడిశాలో జర్సుగుడ జిల్లాలో లైకెరా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ 18 ఏళ్ల యువతి మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి, ఫోన్ మాట్లాడుతుండగా.. దాన్ని బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలు ఉమా ఓరమ్‌గా సంబంధిత వర్గాలు తెలిపాయి. చాలామంది చేసే మాదిరిగానే ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగానే.. ఉమా తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా భారీ శబ్దంతో ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఆమె ఛాతికి, కాలుకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఉమా స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు. ఆ సెల్ ఫోన్ నోకియా 3110 మోడల్ అని తెలిసింది. భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో ఉమా మాట్లాడుతుందని, ఆ సమయంలో ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో, దానికి ఛార్జింగ్ పెట్టి మాట్లాడిందని ఆమె సోదరుడు దుర్గ ప్రసాద్ ఓరమ్ చెప్పాడు. గతేడాదే లాంచ్ అయిన నోకియా ఫోన్ వల్ల ఈ ఘటన జరగడంతో, ఈ మొబైల్ తయారీ కంపెనీ తగిన పరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ముఖంపైనే పేలిన ఐఫోన్ బ్యాటరీ
-
ముఖంపైనే పేలిన ఐఫోన్ బ్యాటరీ
మీ ఫోన్ బ్యాటరీ నాణ్యతను మీరు పరీక్షించాలనుకుంటున్నారా? అయితే కొరకడం లాంటివి మాత్రం చేయకండి. అలా కొరికితే దాని ఫలితం మరింత దారుణంగా ఉంటుంది. చైనాలో ఓ వ్యక్తికి ఇలాంటి విషాదకర అనుభవమే ఒకటి ఎదురైంది. ఐఫోన్ బ్యాటరీ నాణ్యతను పరీక్షించాలనుకున్న ఓ వ్యక్తి, దాన్ని నోట్లు పెట్టుకుని కొరికాడు. ఇక అంతే సంగతులు. మొత్తం లిథియం అయాన్‌తో రూపొందించిన ఈ బ్యాటరీ, ఒక్కసారిగా అతని ముఖంపైనే పేలింది. దీంతో అతని ముఖానికి తీవ్ర హాని కలిగింది. ఈ మొత్తం సంఘటనకు చెందిన వీడియో బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్యాటరీని చెక్ చేయడానికి కొరకడం వంటివి చేసే వారికి ఇది ఓ హెచ్చరికని టెక్ నిపుణులు చెప్పారు. శుక్రవారం ఈ సంఘటన జరిగిందని, కానీ ఎక్కడ జరిగిందో వివరాలను మాత్రం ఈ వీడియో వెల్లడించలేదు. కానీ చైనీస్ టెక్ బ్లాగ్స్లో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఎలక్ట్రానిక్ స్టోర్‌లో ఐఫోన్ బ్యాటరీని కొనడానికి వెళ్లిన వ్యక్తికి ఈ అనుభవం ఎదురైనట్టు తెలిసింది. అయితే బ్యాటరీని పరీక్షించడానికి కొంతమంది ఇలా కొరుకుతూ ఉంటారని రిపోర్టులు పేర్కొన్నాయి. బంగారపు నాణేలను కొరికి పరీక్షించిన మాదిరిగా ఫోన్ బ్యాటరీలను చెక్ చేస్తుంటారని తెలిపాయి. అయితే ఇలా కొరకడం వల్ల బంగారపు నాణేల నాణ్యతను కానీ, ఫోన్ బ్యాటరీల నాణ్యతను కానీ తెలుసుకోలేమని నిపుణులు చెప్పారు. ఫోన్ బ్యాటరీలను కెమికల్స్‌తో తయారీచేయడం వల్ల, ఇవి మీకు ప్రమాదకరమైన హానిని కలిగించగలవని తెలిపారు. సాధారణంగా లిథియం అయాన్‌తో బ్యాటరీలను రూపొందించడం జరుగుతూ ఉంటుంది. పరీక్షించడానికి బ్యాటరీలను కొరికినప్పుడు వాటి కెమికల్స్ మీ చర్మానికి, గొంతుకు, నోరుకు హాని కలిగిస్తాయని రిపోర్టులు తెలిపాయి. -
ఐఫోన్ బ్యాటరీ మళ్లీ పేలింది
జ్యూరిచ్: ఆపిల్ ఐఫోన్ మళ్లీ పేలింది. తాజా నివేదికల ప్రకారం స్విట్జర్లాండ్‌లోని ఒక షాపులో ఐఫోన్ బ్యాటరీ పేలుడు సంభవించింది. మరమ్మత్తు చేస్తుండగా ఐఫోన్ బ్యాటరీ పేలడంతో ఒకవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పేలిన ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ను ఐఫోన్ 6 గా గుర్తించినట్టు సమాచారం. www.swissinfo.ch అందించిన ఒక నివేదిక ప్రకారం మంగళవారం ఈ పేలుడు చోటు చేసుకుంది. జ్యూరిచ్ లోని ఒక ఆపిల్ దుకాణంలో ఐఫోన్ రిపేరు చేస్తుండగా అకస్మాత్తుగా బ్యాటరీ పేలుడు జరిగింది. దీంతో రిపేరు చేస్తున్న వ్యక్తి గాయపడగా, మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ పేలుడుకు కారణాలు ఇంకా తెలియలేదని ఆ నివేదిక పేర్కొంది. ఈ సంఘటనపై జ్యూరిచ్ ఫోరెన్సిక్ ఇన్స్టిట్యూట్ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే స్టోర్ సిబ్బంది తక్షణమే అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఒక ప్రకటనలో తెలిపారు మరోవైపు ఈ పేలుడుపై ఆపిల్ ఇంకా స్పందించలేదు. -
ఫోన్ బ్యాటరీ పేలుడు: ఐదుగురికి గాయాలు
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ధర్మారం తండాలో గురువారం సెల్‌ఫోన్ బ్యాటరీ పేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
గెలాక్సీ నోట్7 షిప్మెంట్లకు షాక్
సియోల్ : ఓ వైపు గెలాక్సీ నోట్ 7 సప్లైను మించి డిమాండ్‌లో దూసుకెళ్తుండగా... మరోవైపు ఆ డివైజ్‌ల సరుకు రవాణా ఆలస్యం కానుందట. ప్రీమియం డివైజ్‌ల్లో అదనంగా నాణ్యతా నియంత్రణ పరీక్షలు చేపట్టనున్న నేపథ్యంలో గెలాక్సీ నోట్ 7 డివైజ్‌ల సరుకు రవాణాను జాప్యం చేయనున్నట్టు టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది. దక్షిణ కొరియాకు చెందిన టాప్-3 క్యారియర్స్(డివైజ్‌లను రవాణా చేసే సంస్థలు) ఎస్కే టెలికాం కంపెనీ లిమిటెడ్, కేటీ కార్పొ, ఎల్జీ అప్లస్ కార్పొలకు పూర్తిగా సరుకు రవాణా నిలిపివేసినట్టు తెలిపింది. ఉత్పత్తి నాణ్యతలో మరిన్ని పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలోనే గెలాక్సీ నోట్7ల సరుకు రవాణాను ఆలస్యం చేస్తున్నామని రాయిటర్స్‌కు పంపిన ఓ ప్రకటనలో శాంసంగ్ పేర్కొంది. అయితే ఫోన్లో లోపాలను శాంసంగ్ వెల్లడించలేదు. గెలాక్సీ నోట్7 ఫోన్ కస్టమర్ల నుంచి శాంసంగ్‌కు భారీగానే ఫిర్యాదులు వెళ్లాయట. ఫోన్‌కు చార్జింగ్ పెడుతున్న సమయంలో పేలుడు ఘటనలు సంభవిస్తున్నాయని కస్టమర్ల ఫిర్యాదులు చేశారని దక్షిణ కొరియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్ గెలాక్సీ నోట్7 క్వాలిటీ కంట్రోల్లో అదనంగా పరీక్షలు నిర్వహించాలని కంపెనీ భావించిందని రిపోర్టులు వెల్లడించాయి. గతేడాది కూడా గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ఫోన్‌ను వినియోగదారులు ఆశించిన మేర సప్లై చేయక అమ్మకాల్లో నిరాశపరిచింది. మరోవైపు శాంసంగ్ పోటీ సంస్థ యాపిల్ వచ్చే వారంలోనే తన కొత్త ఫోన్లను ఆవిష్కరించనున్న నేపథ్యంలో సరుకురవాణా జాప్యం చేయడం అంతమంచిది కాదని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ నోట్7లో లోపాలను వెంటనే సవరించుకోవాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరోవైపు గెలాక్సీ నోట్7 డివైజ్‌లు సరుకు రవాణా ఆలస్యం కానున్నట్టు వార్త బయటికి పొక్కగానే ఆ కంపెనీ షేర్లు ఢమాల్ మనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు రెండు వారాల కనిష్టంలో నమోదయ్యాయి.