సాక్షి, నిజామాబాద్: పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. నిజామాబాద్ టౌన్ సుభాష్ నగర్ లో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ చార్జింగ్ పెట్టి పడుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వాళ్లకు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Nizamabad: ఛార్జింగ్‌లో పేలిన ఈ-బైక్ బ్యాటరీ.. ఒకరి దుర్మరణం
Published Wed, Apr 20 2022 4:27 PM | Last Updated on Wed, Apr 20 2022 5:40 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment