మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ధర్మారం తండాలో సెల్‌ఫోన్ బ్యాటరీ పేలింది.
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ధర్మారం తండాలో గురువారం సెల్‌ఫోన్ బ్యాటరీ పేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.