మీ ఫోన్ బ్యాటరీ నాణ్యతను మీరు పరీక్షించాలనుకుంటున్నారా? అయితే కొరకడం లాంటివి మాత్రం చేయకండి. అలా కొరికితే దాని ఫలితం మరింత దారుణంగా ఉంటుంది. చైనాలో ఓ వ్యక్తికి ఇలాంటి విషాదకర అనుభవమే ఒకటి ఎదురైంది. ఐఫోన్ బ్యాటరీ నాణ్యతను పరీక్షించాలనుకున్న ఓ వ్యక్తి, దాన్ని నోట్లు పెట్టుకుని కొరికాడు. ఇక అంతే సంగతులు. మొత్తం లిథియం అయాన్‌తో రూపొందించిన ఈ బ్యాటరీ, ఒక్కసారిగా అతని ముఖంపైనే పేలింది. దీంతో అతని ముఖానికి తీవ్ర హాని కలిగింది. ఈ మొత్తం సంఘటనకు చెందిన వీడియో బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్యాటరీని చెక్ చేయడానికి కొరకడం వంటివి చేసే వారికి ఇది ఓ హెచ్చరికని టెక్ నిపుణులు చెప్పారు.
శుక్రవారం ఈ సంఘటన జరిగిందని, కానీ ఎక్కడ జరిగిందో వివరాలను మాత్రం ఈ వీడియో వెల్లడించలేదు. కానీ చైనీస్ టెక్ బ్లాగ్స్‌లో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఎలక్ట్రానిక్ స్టోర్‌లో ఐఫోన్ బ్యాటరీని కొనడానికి వెళ్లిన వ్యక్తికి ఈ అనుభవం ఎదురైనట్టు తెలిసింది. అయితే బ్యాటరీని పరీక్షించడానికి కొంతమంది ఇలా కొరుకుతూ ఉంటారని రిపోర్టులు పేర్కొన్నాయి. బంగారపు నాణేలను కొరికి పరీక్షించిన మాదిరిగా ఫోన్ బ్యాటరీలను చెక్ చేస్తుంటారని తెలిపాయి. అయితే ఇలా కొరకడం వల్ల బంగారపు నాణేల నాణ్యతను కానీ, ఫోన్ బ్యాటరీల నాణ్యతను కానీ తెలుసుకోలేమని నిపుణులు చెప్పారు. ఫోన్ బ్యాటరీలను కెమికల్స్‌తో తయారీచేయడం వల్ల, ఇవి మీకు ప్రమాదకరమైన హానిని కలిగించగలవని తెలిపారు. సాధారణంగా లిథియం అయాన్‌తో బ్యాటరీలను రూపొందించడం జరుగుతూ ఉంటుంది. పరీక్షించడానికి బ్యాటరీలను కొరికినప్పుడు వాటి కెమికల్స్ మీ చర్మానికి, గొంతుకు, నోరుకు హాని కలిగిస్తాయని రిపోర్టులు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment