
టెక్ దిగ్గజం ఆపిల్, ఇంటర్నల్ లీక్స్‌పై తన ఉద్యోగులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని లీక్ చేయడం ఆపాలంటూ ఉద్యోగులను హెచ్చరించింది. తన ఇంటర్నల్ బ్లాగ్‌పై కంపెనీ ఓ మోమోను పోస్టు చేసింది. గతేడాది 29 మంది లీకర్స్‌ను గుర్తించామని, వారిలో 12 మంది అరెస్ట్ అయినట్టు కూడా తెలిపింది.
కేవలం ఆపిల్ మాత్రమే కాక, ఇతర టెక్నాలజీ సంస్థలు ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కూడా అంతర్గత రహస్యాల లీకేజీలపై కఠినతరంగా వ్యవహరిస్తున్నాయి. అంతర్గత సమాచారాన్ని రక్షించడానికి కఠినమైన మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి. కాగ, కంపెనీలోని ఉద్యోగులే భవిష్యత్తు ఉత్పత్తులకు సంబంధించిన కీలకమైన అంతర్గత సమాచారాన్ని లీక్ చేస్తూ టెక్ కంపెనీలకు షాకిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజాలు అంతర్గత లీకేజీలపై ఉద్యోగులకు సీరియస్ హెచ్చరికలు జారీచేస్తున్నాయి.
కంపెనీల అంతర్గత సమాచారాన్ని లీక్ చేసిన ఉద్యోగుల జాబ్ ఊడటమే కాక, మరో కంపెనీలో ఉద్యోగం దొరకడం కూడా కష్టతరమవుతుందని ఆపిల్ తెలిపింది. లీకర్స్‌కు విధించిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు అన్నింటిన్నీ ప్రస్తావిస్తూ ఆపిల్ ఉద్యోగులకు ఈ మోమోను జారీచేసింది. ఆపిల్ ఇలా హెచ్చరికలు జారీచేయడం ఇదే మొదటిసారి కాదు. ఐఫోన్ ఎక్స్ ఫోన్ లాంచింగ్ సమయంలో, ఆ లేటెస్ట్ ఫ్లాట్‌షిప్ గురించి పలు కీలకమైన వివరాలను ఓ ఉద్యోగి లీక్ చేశాడు. ఆ సమయంలో కూడా ఆపిల్ ఇదే మాదిరి మండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment