
ఐఐటీ-హైదరాబాద్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. తొలిసారి కూపర్టినోకి చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ ఇంక్ భారత్‌లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ జరుపడానికి వస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌ను ఐఐఐటీ-హైదరాబాద్‌లో చేపట్టనుంది. ఇప్పటికే బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఎస్‌సీ(రీసెర్చ్)లో పలు విభాగాలకు చెందిన 350 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో తమ పేర్లను నమోదుచేసుకున్నారు. డిసెంబర్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించనున్నారు. ఆపిల్‌తో పాటు పలు గ్లోబల్ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్‌లు కూడా ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొననున్నాయి.
'' ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు ఆపిల్ రావడం తెలిసి మేము చాలా సంతోషించాం. అయితే ఎలాంటి ప్రొఫైల్స్‌ను కంపెనీ ఆఫర్ చేయనుందో ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులు వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది అద్భుత అవకాశం'' అని ఐఐఐటీ-హైదరాబాద్ ప్లేస్‌మెంట్ల అధినేత టీవీ దేవీ ప్రసాద్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సు, ఆటోమేషన్‌లకు నియామకాలు జరుపుకోవడానికి ఈసారి కంపెనీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఇటీవల భారత్‌కు విచ్చేసిన ఆపిల్ సీఈవో టిమ్ కుక్, భారత్‌లో పెట్టుబడులు పెంచనున్నట్టు తెలిపారు. అంతేకాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సు, ఆటోమేషన్‌లో నియామకాలను ఎక్కువగా చేపట్టనున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment