శాన్‌ఫ్రాన్సిస్కో : ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనం భారీగా ఎగిసింది. వేతనంతో పాటు ఈయనకు భద్రత కూడా అదే స్థాయిలో పెరిగింది. టిమ్ కుక్ వేతనం 47 శాతం జంప్ చేసి, 2017లో సుమారు 13 మిలియన్ డాలర్లుగా(రూ.83 కోట్లుగా) ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. అంతేకాక ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లోనే ప్రయాణించాలని పేర్కొంది. భద్రతాపరమైన కారణాలతో ఆయన వ్యక్తిగత అవసరాలకు కూడా ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌నే వాడాలని తెలిపింది. న్యూస్ షేర్‌హోల్డర్ ప్రొక్సీ స్టేట్‌మెంట్‌లో నమోదుచేసిన వివరాల ప్రకారం, టిమ్ కుక్ వ్యాపార లేదా వ్యక్తిగత అవసరాలకు ఎక్కడికి ప్రయాణించాలన్న ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లోనే ప్రయాణించేలా బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించినట్టు బిజినెస్ ఇన్‌సైడర్ గురువారం రిపోర్టు చేసింది. తమ గ్లోబల్ ప్రొఫైల్‌లో భాగంగా భద్రతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 2017 నుంచి టిమ్‌కుక్‌కు ఈ పాలసీ అమలు చేస్తున్నామని, సీఈవోగా టిమ్ కుక్ బాధ్యత చాలా ముఖ్యమైనదని ఆపిల్ షేర్‌హోల్డర్ ప్రొక్సీ స్టేట్‌మెంట్‌లో ఫైల్ చేసింది.
టెలిగ్రాఫ్ వివరాల ప్రకారం కుక్ 2017లో 12.8 మిలియన్ డాలర్లను ఇంటికి తీసుకెళ్లారని, దానిలో 3.06 మిలియన్ డాలర్ల వేతనం, 9.3 మిలియన్ డాలర్లు నగదు బోనస్‌లు, మిగిలినవి అదనపు పరిహారాలున్నాయని తెలిసింది. అంతకముందు ఆయనకు 5.4 మిలియన్ డాలర్ల బోనస్‌లు మాత్రమే చెల్లించేవారని రిపోర్టు పేర్కొంది. పరిహారాల ప్యాకేజీల్లో భాగంగా టిమ్ కుక్ వ్యక్తిగత ప్రయాణానికి 2017లో 93,190 డాలర్లు ఖర్చు అయినట్టు తెలిసింది. '' ఏ సమయంలోనైనా టిమ్ కుక్ వ్యక్తిగత అవసరాల కోసం ఆపిల్ ప్రైవేట్ జెట్‌ను వాడుకోవచ్చు. ఈ వ్యయాలను అదనపు పరిహారాలుగా పరిగణలోకి తీసుకుంటాం. దీనిలోనే ఆయన పన్నులు చెల్లించాలి'' అని ఆపిల్ తన ప్రకటనలో పేర్కొంది. అంతేకాక టిమ్ కుక్‌కు వ్యక్తిగత భద్రతా సేవలను కూడా ఆపిల్ అమలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment