శాన్ ఫ్రాన్సిస్కో: టెక్సాస్ చర్చి కాల్పుల ఘటనలో ఐ ఫోన్‌మేకర్, టెక్ దిగ్గజం ఆపిల్ చిక్కుల్లో పడింది. 27మంది మృతికి కారణమైన ఈ ఘటనకు సంబంధించి ఆపిల్‌కు సెర్చ్‌వారెంట్ జారీ అయింది. నిందితుడి ఐ పోన్‌ను అన్‌లాక్ చేయడంలో ఫోరెన్సిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు విఫలం కావడంతో విచారణ అధికారులు అతని డేటా కావాలంటూ ఆపిల్‌ను డిమాండ్ చేశారు.
సదర్లాండ్ స్ప్రింగ్స్ విషాదానికి కారణమైన డెవిన్ పాట్రిక్ కెల్లీ (26) ఐ ఫోన్ ఎస్‌కి సంబంధించిన డేటా కావాలని ఆదేశించింది. శాన్ ఆంటోనియో ఎక్స్‌ప్రెస్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం, టెక్సాస్ రేంజర్స్ ..కెల్లీ ఐఫోన్ ఎస్‌ఈలోని డేటా యాక్సెస్‌కోసం ఈ సెర్చ్ వారంట్ ఇచ్చింది. లోకల్, ఐ క్లౌడ్‌లోని సమాచారం కావాలని కోరింది. ముఖ్యంగా కాల్స్, మెసేజెస్, ఫోటోలు తదితర రికార్డులు సంపాదించేందుకు ఈ నోటీసులు జారి చేసింది. అయితే న్యాయపరమైన అంశం గనుక ప్రస్తుతం దీనిపై ఏమీ వ్యాఖ్యానించలేమని ఆపిల్ ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment